కేసీఆర్ కు గుణపాఠం తప్పదు..: కరీంనగర్ ఎమ్మెల్సీ ఫలితంపై తుల ఉమ ఆసక్తికర వ్యాఖ్యలు

Arun Kumar P   | Asianet News
Published : Dec 10, 2021, 04:20 PM ISTUpdated : Dec 10, 2021, 04:31 PM IST
కేసీఆర్ కు గుణపాఠం తప్పదు..: కరీంనగర్ ఎమ్మెల్సీ ఫలితంపై తుల ఉమ ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితంపై బిజెపి నాయకురాలు తుల ఉమ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.  

కరీంనగర్: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ (telangana mlc elections 2021) స్థానాలను జరుగుతున్న ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా అన్నిచోట్ల ప్రశాంతంగానే పోలింగ్ ముగిసింది. అయితే ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగి ఫలితం వెలువడనుంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై బిజెపి నాయకురాలు తుల ఉమ (tula uma) ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ (karimnagar mlc election 2021) స్థానానికి జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు తుల ఉమ సిరిసిల్ల (siricilla)కు వెళ్లారు. అక్కడ పోలింగ్ కేంద్రం వద్ద వాతావరణాన్ని పరిశీలించిన అనంతరం ఉమ మాట్లాడుతూ... ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ముఖ్యమంత్రి కేసిఆర్ (KCR) కు గుణపాఠం కానుందని ఉమ హెచ్చరించారు. 

Video

''ఈ ప్రజాస్వామ్య ఎన్నికలను అధికారపార్టీ  కూని చేస్తోంది. ఓటు హక్కు కలిగిన ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేసింది. ఇలా అక్రమంగా ఓట్లను కొనుగోలు చేస్తుంది. ప్రజాసేవ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను నిర్బంధంతో టిఆర్ఎస్ పార్టీ (TRS Party) ఓటు వేయించుకోవడం సిగ్గుచేటు'' అని తుల ఉమ మండిపడ్డారు. 

read more  Karimnagar MLC Election 2021: 986 కు ఒక్క ఓటు టీఆర్ఎస్ తగ్గినా... ఈటలకు మంత్రి గంగుల సవాల్ (వీడియో)

''అత్యంత దుర్మార్గంగా కొన్ని వ్యవస్థలు సీఎం కేసీఆర్ కనుసన్నల్లో నడవడం విడ్డూరంగా వుంది. రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థ (state election commission) కూడా కేసీఆర్ సర్కారు చెప్పినట్లే పనిచేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కేసీఆర్ ప్రలోబాలు  కొనసాగాయి'' అని తుల ఉమ ఆరోపించారు. 

''ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్న టిఆర్ఎస్ ఉద్యమ ద్రోహులకే పట్టం కడుతోంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు కేసిఆర్ ను వీడి ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఏకం కావాల్సిన సమయం వచ్చింది'' అని తుల ఉమ పిలుపునిచ్చారు. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో 8 పోలింగ్ కేంద్రాలుండగా 1324 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు కలిగివున్నారు. ఒకరిద్దరు మినహా వీరంతా ఓటుహక్కును వినియోగించుకున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పదిమంది అభ్యర్థులు పోటీలో వున్నారు. అయితే కరీంనగర్ జిల్లాలో గెలుపును ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి రవీందర్ సింగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా 10 ఎసిపిలు, 26 మంది సిఐలు, 54 ఎస్సైలు,115 ఎఎస్సైలు, 323 మంది కానిస్టేబుల్ లతో భారీ భద్రత మద్య పోలింగ్ ప్రక్రియ కొనసాగింది.  

read more  Telangana MLC Polls: ఖమ్మం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఆరు స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్..

ఉమ్మడి కరీంనగర్ లో రెండు స్థానాలకు టీఆర్ఎస్ తరపున తాటిపర్తి భానుప్రసాద్, ఎల్ రమణ ఫోటీ చేసారు. అయితే ఎమ్మెల్సీగా అధికార పార్టీ తనకు అవకాశం ఇస్తుందని ఆశించి భంగపడ్డ కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇండిపెండెంట్ గా ఫోటీలో దిగాడు. సేమ్ ఈటల రాజేందర్ మాదిరిగానే పార్టీ నుండి బయటకు వచ్చిన పార్టీపైనే ఫోటీకి దిగాడు రవీందర్. ఇతడికి బిజెపి, కాంగ్రెస్ పార్టీల మద్దతు వుందన్న వార్త టీఆర్ఎస్ ను కలవరపడుతోంది. దీంతో కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?