shilpa chowdary: శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మూడు రోజుల పాటు విచారణ

Siva Kodati |  
Published : Dec 10, 2021, 03:33 PM IST
shilpa chowdary: శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మూడు రోజుల పాటు విచారణ

సారాంశం

కిట్టి పార్టీల పేరిట సినీ, రాజకీయ ప్రముఖులకు రూ.కోట్లు వసూలు చేసిన శిల్పా చౌదరిని 3 రోజుల కస్టడీకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు. ఈ సందర్భంగా శిల్ప బినామీలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రశ్నించనున్నారు. పోలీసులు. రూ.కోట్లను ఇతరుల అకౌంట్ ద్వారా శిల్ప తీసుకున్నట్లు గుర్తించారు. 

కిట్టి పార్టీల పేరిట సినీ, రాజకీయ ప్రముఖులకు రూ.కోట్లు వసూలు చేసిన శిల్పా చౌదరిని 3 రోజుల కస్టడీకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు. ఈ సందర్భంగా శిల్ప బినామీలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రశ్నించనున్నారు. పోలీసులు. రూ.కోట్లను ఇతరుల అకౌంట్ ద్వారా శిల్ప తీసుకున్నట్లు గుర్తించారు. శిల్పకు సహకరించిన అందరినీ ప్రశ్నించనున్నారు పోలీసులు. శిల్పను మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ గురువారం ఉప్పర్‌పల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు పోలీసులు ఆమెను చంచల్‌గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. 

కాగా.. గతంలో రెండు రోజుల విచారణ సందర్భంగా శిల్పా చౌదరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తులో ముందుకు వెళ్తున్నారు పోలీసులు.  శిల్ప కేసులో తమను మోసం చేసిందని ఇప్పటికే పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బ్లాక్ మనీ కావడంతో ఫిర్యాదు చేయడానికి పలువురు ప్రముఖులు వెనుకాడుతున్నట్లుగా తెలుస్తోంది. 

ALso Read:శిల్పా చౌదరి కేసు : కేసులో ట్విస్ట్.. విచారణకు రాధికారెడ్డి డుమ్మా.. నోటీసులివ్వనున్న పోలీసులు..!

మరోవైపు శిల్పా చౌదరి (shilpa chowdary) పోలీస్ కస్టడీ శనివారంతో ముగిసింది. దీంతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి..స్టేట్‌మెంట్ సమర్పించారు పోలీసులు. అనంతరం శిల్పా చౌదరిని చంచల్‌గూడ మహిళా జైలుకు (chanchalguda womens jail) తరలించారు. తన స్థాయిని పెంచుకునేందుకు శిల్ప రకరకాలుగా ప్రయత్నాలు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. బిల్డప్‌ కోసం… స్టేటస్‌ సింబల్‌గా బౌన్సర్లను నియమించుకున్నట్టు ఆమె చెప్పింది. 

అంతేకాదు ఆమె రెండేళ్లు అమెరికాలో (america) ఉండి వచ్చినట్లు తేలింది. అయితే.. శిల్పా చౌదరి ఎందుకు అమెరికా వెళ్లారు.. ఎవరెవరు వెళ్లారు.. అక్కడ కూడా డీలింగ్స్‌ చేశారా.. అనే కోణంలోను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘరానామోసం కేసులో రాధికారెడ్డి (radhika reddy) పేరు తెరపైకి రావడం పెద్ద దుమారం రేపుతోంది. ఆమె ఏకంగా పది రూపాయల వడ్డీకి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నట్టు తేలింది. ఆ డబ్బంతా రియల్ ఎస్టేట్‌ బిజినెస్‌ మీదే పెట్టారా.. ఇతర రూపాల్లో మళ్లించారా.. అన్నది లెక్క తేలాల్సి ఉంది. అయితే రాధికా రెడ్డి మాత్రం పోలీసుల విచారణకు రాలేదు. 
 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu