లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన‌ టీఎస్ఎస్పీడీసీఎల్ ఉద్యోగులు.. ముగ్గురు అరెస్ట్

By Mahesh Rajamoni  |  First Published May 3, 2023, 1:30 AM IST

Hyderabad: లంచం తీసుకుంటూ టీఎస్ఎస్పీడీసీఎల్ ఉద్యోగులు ప‌ట్టుబ‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ముగ్గురు ఉద్యోగులు అరెస్టు అయ్యారు. గౌతమ్, శ్రీనివాస్, ప్రసాద్ లపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
 


Three TSSPDCL employees arrested for bribery: లంచం తీసుకుంటూ టీఎస్ఎస్పీడీసీఎల్ ఉద్యోగులు ప‌ట్టుబ‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ముగ్గురు ఉద్యోగులు అరెస్టు అయ్యారు. గౌతమ్, శ్రీనివాస్, ప్రసాద్ లపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

వివ‌రాల్లోకెళ్తే.. నగరంలోని ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.5 వేలు లంచం డిమాండ్ చేస్తున్న టీఎస్ఎస్పీడీసీఎల్  కు చెందిన ముగ్గురు ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. చిలుకానగర్ సెక్షన్ టీఎస్ఎస్పీడీసీఎల్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్ పీ.ప్రసాద్ బాబు పనుల అంచనాలు రూపొందించి అనుమతుల కోసం ఉన్నతాధికారులకు పంపేందుకు కాంట్రాక్టర్ నవీన్ కుమార్ నుంచి రూ.10 వేలు డిమాండ్ చేశారు.

Latest Videos

లైన్ ఇన్ స్పెక్టర్ ఇనపూడి శ్రీనివాస్ రావును బేరసారాలు జరిపి లంచం తీసుకోవాలని బాబు కోరారు. రూ.5వేలు ఇస్తానని శ్రీనివాస్ ను నవీన్ నమ్మించి ఆ మొత్తాన్ని ప్రసాద్ బాబు వద్ద ప్ర‌యివేటు అసిస్టెంట్ గా పనిచేస్తున్న గౌతమ్ అనే వ్యక్తికి ఇవ్వాలని సూచించాడు.

లంచం మొత్తాన్ని చెల్లించడానికి బదులు నవీన్ ఏసీబీని ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి.. నిఘా పెట్టి లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టుకున్నారు. నవీన్ నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా గౌతమ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. శ్రీనివాస్, ప్రసాద్ ఆదేశాల మేరకే ఈ మొత్తాన్ని తీసుకున్నట్లు గౌతమ్ చెప్పినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. గౌతమ్, శ్రీనివాస్, ప్రసాద్ లపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

click me!