హెచ్‌సీయూ డిపోలో కండక్టర్ ఆత్మహత్యాయత్నం: పరిస్థితి విషమం

By Siva Kodati  |  First Published Oct 14, 2019, 3:05 PM IST

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రోజు రోజుకు ఉద్ధృతమవుతోంది. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపో ముందు మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. సందీప్ అనే కండక్టర్ బ్లేడుతో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు


ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రోజు రోజుకు ఉద్ధృతమవుతోంది. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపో ముందు మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

సందీప్ అనే కండక్టర్ బ్లేడుతో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన తోటి కార్మికులు, పోలీసులు అతనిని అడ్డుకుని కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Latest Videos

ప్రస్తుతం సందీప్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ సాక్షిగా పోలీసులు అంతా చూస్తుండగానే మరో ఆర్టీసీ డ్రైవర్ వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

వెంటనే స్పందించిన తోటి కార్మికులు, రాజకీయ నేతలు, పోలీసులు అతనిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా ఖమ్మంలో శనివారం ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. 

click me!