పోలీసులు వేధిస్తున్నారు: నాంపల్లి కోర్టు దగ్గర వృద్ధురాలు ఆత్మహత్య

Published : Oct 14, 2019, 01:57 PM IST
పోలీసులు వేధిస్తున్నారు: నాంపల్లి కోర్టు దగ్గర వృద్ధురాలు ఆత్మహత్య

సారాంశం

వృద్ధురాలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్: నాంపల్లి కోర్టు దగ్గర కలకలం చోటు చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం చేశారు. వృద్ధురాలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. 

ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కోర్టు కేసులతో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పోలీసుల వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వృద్ధురాలు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్