స్వప్నలోక్ అగ్నిప్రమాదం.. వెలుగులోకి క్యూనెట్ బాగోతాలు, దాని పాత్రపైనా విచారించాలి : సజ్జనార్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 18, 2023, 3:52 PM IST
Highlights

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం నేపథ్యంలో క్యూనెట్ సంస్థ బండారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో బీఎం5 సంస్థ పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తూ తెరవెనుక క్యూనెట్ ఎంఎల్ఎం దందా సాగిస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మండిపడ్డారు. 
 

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దగ్భ్రాంతిని కల్పించిన సంగతి తెలిసిందే. దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రధానంగా క్యూనెట్ సంస్థ పాత్రపై సమగ్ర విచారణ జరపాలని.. ఇలాంటి మోసపూరిత సంస్థల కదలికలపై నిఘా పెట్టాలని సజ్జనార్ తెలిపారు. తాజా ప్రమాదంలో క్యూనెట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులే మరణించారని.. ఈ కంపెనీపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. ఈడీ క్యూనెట్ ఆస్తులను జప్తు చేసిందని.. అయినప్పటికీ ఈ సంస్థ తీరు మారడం లేదన్నారు. 

స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో బీఎం5 సంస్థ పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తూ తెరవెనుక క్యూనెట్ ఎంఎల్ఎం దందా సాగిస్తోందని.. అక్కడ 40 మందికిపైగా యువతీయువకులు పనిచేస్తున్నారని సజ్జనార్ తెలిపారు. క్యూనెట్ ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షలాది రూపాయలు కట్టించుకుకున్నట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని ఆయన ట్వీట్‌లో తెలిపారు. డబ్బుకోసం క్యూనెట్ లాంటి సంస్థల మాయలో పడొదదని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. అలాగే అధిక  అద్దెలకు ఆశపడి.. ఇలాంటి సంస్థలకు భనవ సముదాయాలను ఇవ్వొద్దని ఆయన సూచించారు. 

Also REad: క్యూనెట్ ఒక ఫ్రాడ్ సంస్థ.. అలాంటి ఎంఎల్ఎం సంస్థల వలల్లో చిక్కుకోవద్దు: వీసీ సజ్జనార్

ఇదిలావుండగా.. సైబరాబాద్ సీపీగా వీసీ సజ్జనార్ ఉన్నప్పుడు క్యూనెట్ మోసాలపై ఫోకస్ పెట్టారు. ఆ కంపెనీకి చెందిన మోసాలపై దేశవ్యాప్తంగా దాదాపు 60 మందిని అరెస్టు చేశారు. క్యూనెట్‌ను ప్రమోట్ చేసిన సెలెబ్రిటీలు అనిల్ కపూర్, బొమన్ ఇరానీ, జాకీష్రాఫ్, పూజా హెగ్దే, షారూఖ్ ఖాన్‌కూ 2019లో నోటీసులు పంపారు. ఇందుకు సంబంధించిన కేసులో 500 మందికి సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాజాగా క్యూనెట్ ఆస్తులను ఈడీ సీజ్ చేయడంతో సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. క్యూనెట్ వంటి మోసపూరిత గొలుసుకట్టు జాతీయ, అంతర్జాతీయ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలు అనేకం ఉన్నాయని, వాటి బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు.

 

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ పాత్రపై సమగ్ర విచారణ జరగాలి. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీస్‌ నిఘా పెట్టాలి. 1/6

FILE PHOTOs pic.twitter.com/zPljnZMX54

— V.C. Sajjanar, IPS (@SajjanarVC)
click me!