నాంపల్లి కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు.. రామచంద్ర భారతికి బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

By Mahesh KFirst Published Mar 18, 2023, 3:28 PM IST
Highlights

అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో నిందితుడు రామచంద్ర భారతికి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రామచంద్ర భారతి బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవని పిటిషన్ కొట్టేసింది.
 

హైదరాబాద్: నాంపల్లి కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. మోయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో నిందితుడైన రామచంద్ర భారతి బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాత నాంపల్లి కోర్టు ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేసింది. రామచంద్ర భారతి బెయిల్‌ను రద్దు చేయలేదు. బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

గత సంవత్సరం రామచంద్ర భారతి జైలు నుంచి విడుదల కాగానే బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, అదే రోజు మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అర్జున్ రామచంద్ర భారతికి రిమాండ్‌ను తిరస్కరించారు. రామచంద్ర భారతికి అదే రోజు బెయిల్ మంజూరు చేశారు. అనంతరం, కొన్ని రోజుల వ్యవధిలోనే రామ చంద్ర భారతికి బెయిల్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సెషన్స్ న్యాయ స్థానంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన కోర్టుకు ఎదురు దెబ్బ తగిలింది.

click me!