మెట్టుదిగని కేసీఆర్.. ఆర్టీసీ జేఏసీ చివరి ఆశలు వారిపైనే...

Published : Nov 27, 2019, 01:10 PM ISTUpdated : Nov 27, 2019, 01:28 PM IST
మెట్టుదిగని కేసీఆర్..   ఆర్టీసీ జేఏసీ చివరి ఆశలు వారిపైనే...

సారాంశం

సమ్మెను విరమించినా కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకపోవడంపై ఆర్టీసీ జేఏసీ నేతలు భవిష్యత్తు కార్యచరణపై మంతనాలు ప్రారంభించారు.

సమ్మెను విరమించినా కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకపోవడంపై ఆర్టీసీ జేఏసీ నేతలు భవిష్యత్తు కార్యచరణపై మంతనాలు ప్రారంభించారు. ఈ క్రమంలో విషయాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు గాను ఢిల్లీ వెళ్లాలని భావిస్తున్నారు.

మంగళవారం ఆర్టీసీ డిపోల వల్ల విధుల్లో చేరేందుకు వెళ్లిన కార్మికులను పోలీసులు అడ్డుకోవటాన్ని నేతలు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో జేఏసీ నేతలు సమావేశమయ్యారు.

Also Read:ప్రతిపాదనలు రెడీ: ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేంద్రానికి కేసీఆర్ లేఖ

కాగా సోమవారం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ కీలక ప్రకటన చేశారు. కార్మికులను ఎట్టి పరిస్ధితుల్లోనూ విధుల్లోకి తీసుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు.

లేబర్ కోర్టు నిర్ణయం తీసుకునే వరకు సంయమనం పాటించాలని ఎండీ సూచించారు. విధుల్లో చేరతామని జేఏసీ నేతలు చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని సునీల్ శర్మ వ్యాఖ్యానించారు. ఇష్టం వచ్చినప్పుడు సమ్మెకు వెళ్లి.. ఇష్టమైనప్పుడు విధుల్లోకి వస్తామంటే చట్టప్రకారం కుదరదని సునీశ్ శర్మ వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ ఆదేశాల ప్రకారం విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం డిపోల వద్ద శాంతిభద్రతల సమస్యల సృష్టించవద్దని.. చట్టాన్ని ఉల్లంఘిస్తే క్షేమించేది లేదని సునీల్ శర్మ హెచ్చరించారు.

అన్ని డిపోల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. పండగ రోజుల్లో అనాలోచితంగా సమ్మె చేశారని సునీల్ శర్మ ధ్వజమెత్తారు. అంతకుముందు సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ ఇచ్చిన లేఖను ఆర్టీసీ ఎండీ పేషీ తిప్పి పంపించింది. దీంతో ఆ లేఖను లేబర్ కమీషనర్ కార్యాలయంలో ఇచ్చారు జేఏసీ నేతలు. 

Also read:ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేసీఆర్ కు గడ్కరీ మెలిక: జగన్ కు కూడా....

సోమవారం నాడు ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్మికుల శ్రేయస్సు కోసమే విధులకు హాజరుకావాలని  నిర్ణయం తీసుకొన్నట్టుగా జేఎసీ కన్వీనర్  ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు.

తాము ఓడిపోలేదు,  ప్రభుత్వం గెలవలేదని ఆర్టీసీ జేఎసీ కన్వీసర్ ఆశ్వత్థామరెడ్డి అభిప్రాయపడ్డారు.. ఈ నెల 26వ తేదీ నుండి సమ్మెను విరమించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా జేఎసీ ప్రకటించింది. ప్రజల సౌకర్యార్ధం సమ్మెను విరమించినట్టుగా జేఎసీ నేతలు చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu