విధుల్లోకి వెళతాం.. కానీ అది చిల్లర చర్య: కేసీఆర్‌పై అశ్వత్థామరెడ్డి ఫైర్

By Siva KodatiFirst Published Nov 29, 2019, 3:25 PM IST
Highlights

కేవలం హక్కుల కోసమే యూనియన్లు లేవని, చట్ట ప్రకారం కార్మిక నేతలకు కొన్ని మినహాయింపులు వుంటాయని ఆయన గుర్తుచేశారు. కార్మిక సంఘాల నేతల డ్యూటీ రిలీఫ్ తొలగించడం చిల్లర చర్యని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. 

కార్మిక సంఘాల నేతల డ్యూటీ రిలీఫ్ తొలగించడంపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేవలం హక్కుల కోసమే యూనియన్లు లేవని, చట్ట ప్రకారం కార్మిక నేతలకు కొన్ని మినహాయింపులు వుంటాయని ఆయన గుర్తుచేశారు. కార్మిక సంఘాల నేతల డ్యూటీ రిలీఫ్ తొలగించడం చిల్లర చర్యని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు.

అవసరమైతే యూనియన్ల నేతలంతా విధుల్లోకి వెళతామని... ఆర్టీసీని అధికారులు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు.

Also Read:యూనియన్ నేతలకు కేసీఆర్ షాక్: ఆ డ్యూటీలు క్యాన్సిల్

ఆర్టీసీ చరిత్రలోనే ఇది ఓ చారిత్రక సమ్మెని.. కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని ఆయన కోరారు. కార్మికుల సమస్యలు తీర్చేలా ప్రభుత్వం ముందుకెళ్లాలని కోరుతున్నామని.. యూనియన్లు ఉండాలా..? లేదా..? అన్నది లేబర్ కోర్టు నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు.

దశాబ్ధాలుగా ట్రేడ్ యూనియన్లు ఉన్నాయని.. కార్మిక సంఘాలతో పాటు అనేక సంఘాలు తెలంగాణ పోరాటంలో ముందున్నాయని అశ్వత్థామరెడ్డి గుర్తుచేశారు. కార్మికులతో రెఫరెండం పెట్టించి... యూనియన్లు ఉండాలా..? వద్దా అన్నది తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి ప్రజా రవాణా వ్యవస్థను కాపాడేందుకే తాము పోరాటం చేశామన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోమని చెప్పడం సంతోషదాయకమైన విషయమని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు.

బకాయిలు వెంటనే చెల్లించాలని కోరామని, కార్మికుల సమస్యలపై లేబర్ కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమ్మ కాలంలో 31 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని వారి కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

Also Read:అన్న మాట ప్రకారం: ఆర్టీసీ కార్మికులతో ఆదివారం కేసీఆర్ భేటీ

ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు ఇంకా అందలేదని.. వాటిని వెంటనే చెల్లించాలని మరో నేత రాజిరెడ్డి కోరారు. యూనియన్లను రద్దు చేసే హక్కు ఎవరికీ లేదని, తెలంగాణ ఉద్యమంలో అనేక యూనియన్లు కీలక పాత్ర పోషించాయని ఆయన గుర్తుచేశారు. ఒకవేళ యూనియన్ల వల్ల నష్టం వస్తోందని భావిస్తే సరిదిద్దుకుంటామని రాజిరెడ్డి స్పష్టం చేశారు. 

click me!