ఆ డ్రైవర్ నీలిచిత్రాలు చూస్తూ బస్సు నడిపిండు

First Published Jul 5, 2017, 3:25 PM IST
Highlights

ఆయన ఆర్టీసి బస్సు డ్రైవర్. ఆయన ప్రయాణీకులను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత నెరవేర్చాలి. కానీ ఆయన డ్రైవింగ్ చేశాడు కానీ దాంతోపాటు ఒక గలీజు పని కూడా చేసిండట. విషయం తెలుసుకున్న ఒక ప్రయాణీకుడు డిపో అధికారులకు ఫిర్యాదు చేసిండు.

ఆయన ఆర్టీసి బస్సు డ్రైవర్. ఆయన ప్రయాణీకులను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత నెరవేర్చాలి. కానీ ఆయన డ్రైవింత్ చేశాడు కానీ దాంతోపాటు ఒక గలీజు పని కూడా చేసిండట. విషయం తెలుసుకున్న ఒక ప్రయాణీకుడు డిపో అధికారులకు ఫిర్యాదు చేసిండు.

 

ఆర్టీసీ సంస్థ ఇటీవల ప్రవేశపెట్టిన మినీ వజ్ర బస్సులో డ్రైవర్‌ నీలి చిత్రాలు చూస్తూ నడుపుతున్నాడని ఓ ప్రయాణికుడు జనగామ డిపోలో మంగళవారం ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుడు నాగలింగం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నా యి. వరంగల్‌–2 డిపోకు చెందిన టీఎస్‌ 03 జెడ్‌ 0340 నంబరు గల వజ్ర బస్సు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి వెళ్తున్నది.  బస్సు స్టేషన్‌ఘన్‌పూర్‌ దాటగానే కుదుపునకు లోనయిందన్నారు. అనుమానం వచ్చి చూడడంతో బస్సు డ్రైవర్ నావిగేషన్‌ కోసం ఉపయోగిస్తున్న ట్యాబ్‌లో నీలి చిత్రాలు చూస్తున్నట్లు గమనించారు. వెంటనే బస్సు ఆపి డ్రైవర్‌ను నిలదీయడంతో తమనే బెదిరించే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. బస్సుతో సహా తీసుకెళ్లి జనగామ డిపోలో అధికారులకు ఫిర్యాదు చేశారు నాగలింగం

 

డ్రైవర్‌ బుకాయించడంతో ట్యాబ్‌లోని యూ ట్యూబ్‌లో ఉన్న నీలి చిత్రాలకు సంబంధించి వీడియోలను చూపించారు. నావిగేషన్‌ కోసం ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేస్తే నీలిచిత్రాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలి చిత్రాలను చూడలేదని చెబుతున్న డ్రైవర్‌ యూ ట్యుబ్‌ తెరవగానే అవి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయని అధికారులను ప్రశ్నించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కల్పించుకుని ప్రయాణికుడు నాగలింగం కు సర్ది చెప్పి పంపించేశారు. బస్సు డ్రైవర్లు జర జాగ్రత్త మరి. గిసోంటి పని చెయ్యకురి.

 

 

బస్సు డ్రైవర్ పై ఫిర్యాదు చేస్తున్న ప్రయాణికుడు.

click me!