TSPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఆరు ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్షల ఫలితాలు విడుదల

By Rajesh KarampooriFirst Published Feb 17, 2024, 4:00 AM IST
Highlights

TSPSC: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల ఫలితాలు విడులయ్యాయి. ఈ మేరకు ఆరు ఉద్యోగ ప్రకటనల  జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాల (జీఆర్‌ఎల్‌)ను టీఎస్‌పీఎస్సీ(TSPSC) శుక్రవారం రాత్రి విడుదల చేసింది.

TSPSC: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నిరోజులుగా ఎదురుచూస్తున్న చూస్తున్న పరీక్ష పలితాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 ఉద్యోగాల ఫలితాలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.ఈ మేరకు జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాల (జీఆర్‌ఎల్‌)ను టీఎస్‌పీఎస్సీ(TSPSC) శుక్రవారం రాత్రి విడుదల చేసింది.  టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ (టీబీపీవో), డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, హార్టికల్చర్‌ ఆఫీసర్‌, ఇంటర్‌ విద్యలో లైబ్రేరియన్‌, రవాణా శాఖలో అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. 

వాస్తవానికి ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటీఫికేషన్ 2022లో విడుదల కాగా.. 2023 మే, జూన్‌, జులై నెలల్లో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించారు. తాజాగా ఈ పరీక్షల జనరల్‌ ర్యాంకు జాబితాలను టీఎస్‌పీఎస్సీ (TSPSC) వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు కమిషన్‌ కార్యదర్శి వెల్లడించారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో జాబితాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.  మెరిట్‌ ప్రకారం జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాలను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. త్వరలోనే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. 

ప్రకటించిన ఫలితాలు ఇవే..

మున్సిపల్‌శాఖలో టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ సంబంధించిన 175 పోస్టులకు 2023 జూలై 8న పరీక్ష నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫలితాలను విడుదల చేయగా, జోన్‌ 7కు చెందిన  అభ్యర్థికి 300 మార్కులకు గానూ 254.032 మార్కులతో టాపర్‌గా నిలిచారు. మొత్తం 20,123 మంది సంబంధించిన  మెరిట్‌ జాబితాను విడుదల చేశారు. 

డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సంబంధించిన 18 డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 2023 మే 19న పరీక్ష జరిగింది. మొత్తం 10,630 మంది అభ్యర్థులతో కూడిన మెరిట్‌ లిస్టు విడుదలైంది.  

ఉద్యానశాఖలో 22 హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి 2023 జూన్‌ 17న పరీక్ష జరిగింది. ఇందుకు సంబంధించి 1,035 మంది అభ్యర్థులతో కూడిన మెరిట్‌ లిస్టు విడుదలైంది. 

ఇంటర్‌ విద్యలో 71 లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి గత ఏడాది మే 17న పరీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించి 2,634 మందికి సంబంధించిన మెరిట్‌ జాబితా విడుదలైంది. 

రవాణా శాఖలో 113 ఏఎంవీఐ పోస్టుల భర్తీకి జూన్‌ 28న పరీక్ష నిర్వహించగా..  మొత్తం 4,703 మందికి  సంబంధించిన మెరిట్‌ జాబితా విడుదలైంది. 

వ్యవసాయశాఖలో 148 అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి 2023 మే 16న పరీక్ష నిర్వహించారు. మొత్తం 400 మార్కులకు పరీక్షను నిర్వహించగా.. మొత్తం 6,511 మందికి సంబంధించిన  మెరిట్‌ జాబితాను విడుదల చేశారు.  
 

పరీక్ష ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

 

click me!