లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాక సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టులో చివరి దశకు వచ్చిందని, త్వరలోనే ఆయన జైలుకు వెళ్లుతారని పేర్కొన్నారు.
Padi Kaushik Reddy: లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాక సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వార్తల్లోకి ఎక్కాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాష సీఎం పదవికి ఉన్న గౌరవాన్ని మంటగలిపేలా ఉన్నదని అన్నారు. అధికారానికి వచ్చాం కదా.. అని గత ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టులో చివరి దశకు వచ్చిందని పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని, రేవంత్ రెడ్డి దోషిగా తేలడం ఖాయం అని అన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం తథ్యం అని జోస్యం చెప్పారు.
అసలు కాంగ్రెస్ పార్టీలో ఏక్‌నాథ్ షిండే రేవంత్ రెడ్డినే అని పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఏక్‌నాథ్ షిండేగా మారుతారని అన్నారు.
Also Read: Chandrababu: చంద్రబాబు రాజశ్యామల యాగం.. అందుకోసమేనా?
కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, గత ప్రభుత్వం చేసిన పనులకు క్రెడిట్ కొట్టేస్తున్నారని కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్, ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ను తామే చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కలర్ ఇస్తున్నదని ఫైర్ అయ్యారు.