మరో పరీక్ష వాయిదా వేసిన టీఎస్‌పీఎస్‌సీ: జూన్ 17న హార్టికల్చర్ ఆఫీసర్స్ ఎగ్జామ్

By narsimha lode  |  First Published Mar 28, 2023, 8:36 PM IST

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో పరీక్షను వాయిదా  వేసింది.  ఈ ఏడాది ఏప్రిల్ 4న నిర్వహించాల్సిన  హార్టికల్చర్ ఆఫీసర్స్ పరీక్షను  జూన్  17వ తేదీకి వాయిదా వేసింది  టీెష్‌పీఎస్‌సీ.


హైదరాబాద్:  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  మరో పరీక్షను వాయిదా వేసింది.  హార్టికల్చర్ ఆఫీసర్స్ పరీక్షను  టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది.  ఈ ఏడాది  జూన్  17న ఈ పరీక్షను నిర్వహించనున్నట్టుగా  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  ప్రకటించింది .

హార్టికల్చర్ ఆఫీసర్స్  పరీక్షకు ఈ ఏడాది  జనవరి3 నుండి  జనవరి  24వ తేదీ వరకు   ధరఖాస్తులను  స్వీకరించారు. మొత్తం  22 పోస్టులను భర్తీ చేయనున్నారు.  మొత్తం  450 మార్కులతో  రెండు పేపర్లను అభ్యర్ధులు  రాయాల్సి ఉంటుంది.  పేపర్-లో  జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పై  ప్రశ్నలుంటాయి. పేపర్-2 లో  హార్టికల్చర్  విభాగంలో  ప్రశ్నలుంటాయి.

Latest Videos

also read:రూ. 100 కోట్ల పరువు నష్టం :రేవంత్ , బండి సంజయ్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

హార్టికల్చర్  ఆఫీసర్స్ పరీక్షలను  ఈ ఏడాది ఏప్రిల్  4న  నిర్వహించనున్నట్టుగా  తొలుత  టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది.  కానీ  టీఎస్‌పీఎస్‌సీలో  పేపర్ లీక్ అంశం  తెరమీదికి  రావడంతో  కొన్ని పరీక్షలను రద్దు  చేశారు అధికారులు. మరికొన్ని పరీక్షలను వాయిదా వేశారు. 

గ్రూప్-1 ప్రిలిమ్స్,  అసిస్టెంట్ ఇంజనీర్,  అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,  డివిజన్ అకౌంట్స్  ఆఫీసర్ పరీక్షలను  టీఎస్‌పీఎస్‌సీ రద్దు  చేస్తున్నట్టుగా  ప్రకటించింది. వెటర్నరీ అసిస్టెంట్  సర్జన్లు,  టౌన్ ప్లానింగ్  ఓవర్సీస్ పరీక్షలను  వాయిదా వేస్తున్నట్టుగా  టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన  పరీక్షలకు సంబంధించి   పేపర్ లీక్ అంశం  తెరమీదికి  రావడంతో   కొన్ని  పరీక్షలను వాయిదా వేశారు. మరికొన్ని పరీక్షలను  రద్దు  చేశారు.టీఎస్‌పీఎస్‌సీ కి  చెందిన  కంప్యూటర్లు హ్యాక్ అయినట్టుగా తొలుత ప్రచారం సాగింది. ఈ ప్రచారం ఆధారంగా    వెటర్నరీ అసిస్టెంట్  సర్జన్  నియామకాలు,  టౌన్ ప్లానింగ్  ఓవర్సీస్  పరీక్షలు  వాయిదాపడ్డాయి. ఈ నెల 12,  15, 16 తేదీల్లో  ఈ పరీక్షలు  జరగాల్సి  ఉంది.కానీ ఈ పరీక్షలను  వాయిదా వేశారు.  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్లు  లీకయ్యాయయని  పోలీసులు గుర్తించారు.  దీంతో  ఈ కేసు విచారణను సిట్  కు అప్పగించింది  రాష్ట్ర ప్రభుత్వం.పేపర్ లీక్ అంశానికి సంబంధించి  సిట్ బృందం  ఇప్పటికే  13 మందిని అరెస్ట్  చేసింది.  రానున్న రోజుల్లో  ఈ కేసుల్లో  మరిన్ని అరెస్టులు  జరిగే  అవకాశం లేకపోలేదు. 

click me!