టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం.. అతడి కోసం లుక్ అవుట్ సర్క్యులర్!

By Sumanth KanukulaFirst Published Mar 27, 2023, 7:11 PM IST
Highlights

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో కీలక పరిణామాం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు  చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో కీలక పరిణామాం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు  చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఈ కేసులో రాజశేఖర్‌ రెడ్డికి బావ వరుసయ్యే ప్రశాంత్‌ కోసం లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినట్టుగా సమాచారం. ప్రశాంత్‌ న్యూజిలాండ్‌లో ఉంటుండగా.. అతనికి రాజశేఖర్ ద్వారా గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం చేరింది. దీంతో ప్రశాంత్ అక్కడే పేపర్‌లో ప్రశ్నలకు జవాబులు ప్రిపేర్ అయి.. ఇక్కొడికి వచ్చి పరీక్ష రాశాడు. అనంతరం  తిరగి న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. ప్రశాంత్‌కు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100కు పైగా మార్కులు కూడా వచ్చినట్టుగా కూడా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. 

అయితే ఈ విషయం గుర్తించిన సిట్‌ అధికారులు.. వాట్సాప్‌‌, మెయిల్‌‌ ద్వారా ప్రశాంత్‌‌ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే సిట్ అధికారులకు ప్రశాంత్‌‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడి కోసం సిట్ అధికారులు లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ చేశారు. న్యూజిలాండ్‌ నుంచి ప్రశాంత్ ఇండియాకు తిరిగి వస్తే.. ఇమ్మిగ్రేషన్ అధికారులు సిట్‌ బృందానికి సమాచారం పంపేందుకు గానూ ఈ నోటీసులు జారీచేసినట్టుగా తెలుస్తోంది. 

click me!