
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష పేపర్ లీక్ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డిలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నిస్తుంది. ప్రస్తుతం ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డిలు చంచల్ గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఈడీ అధికారుల బృందం.. ప్రవీణ్, రాజశేఖర్‌లను విచారిస్తున్నాయి. మనీలాండరింగ్ కోణంలో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌లను ఈడీ విచారిస్తుంది. ప్రవీణ్, రాజశేఖర్ బ్యాంక్ ఖాతాల వివరాలను కూడా సేకరించిన ఈడీ.. పేపర్ లీక్ వ్యవహారంలో నగదు లావాదేవీలపై నిందితులను ప్రశ్నిస్తుంది.
అలాగే టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ రూమ్ ఇంచార్జి శంకరలక్ష్మి నుంచి లభించిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ఇద్దరు నిందితులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈడీ అధికారులు.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 50లోని నిబంధనల ప్రకారం శంకరలక్ష్మి వాంగ్మూలాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: వారందరితో వైఎస్ వివేకాకు అక్రమ సంబంధాలు.. బెయిల్ పిటిషన్‌లో అవినాష్ రెడ్డి సంచలనం..
ఇదిలా ఉంటే.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్‌లను విచారించేందుకు ఈడీ అధికారులు.. నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు వారిని రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. అయితే నిందితుల తరపు న్యాయవాది సమక్షంలో విచారించాలని ఈడీకి ఆదేశం నాంపల్లి కోర్టు ఆదేశించింది.