
ఆంధ్రప్రదేశ్ మంత్రులు, నాయకులుపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తాను ఏపీ ప్రజలను ప్రజలను తిట్టలేదని, ఏం అనలేదని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న మంచి గురించే చెప్పడం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా కోసం, విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాటడం లేదని అడిగానని చెప్పారు. ఏపీ ప్రజల తరపునే తాను మాట్లాడనని అన్నారు. అయినా కొంతమంది నాయకులు తనపై ఎగిరెగిరి పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏపీ ప్రజల మేలు కోసమే మాట్లాడానని చెప్పారు.
అక్కడి నాయకులకు చేతనైతే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి కాళేశ్వరం లాగా ప్రజలకు నీళ్లు ఇవ్వాలని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని సెటైర్లు వేశారు. తాను ఏపీ ప్రజలను కించపరినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అడిగినదానికి సమాధానం చెప్పలేకే ఇలాంటి మాటలు అని విమర్శించారు. తెలంగాణ అభివృద్దిలో భాగమైన ప్రతి ఒక్కరు తమ బిడ్డలేనని అన్నారు.
Also Read: వారందరితో వైఎస్ వివేకాకు అక్రమ సంబంధాలు.. బెయిల్ పిటిషన్‌లో అవినాష్ రెడ్డి సంచలనం..
ఇక, ఇటీవల తెలంగాణ మంత్రి హరీష్ రావు కామెంట్స్‌పై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఏపీ మంత్రుల కామెంట్స్‌కు హరీష్ రావు కూడా తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తూ వస్తున్నారు.