'గ్రూప్-1' ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయ్ .. మెయిన్స్‌ ఎప్పుడంటే?

By Rajesh KarampooriFirst Published Jan 14, 2023, 1:51 AM IST
Highlights

తెలంగాణ  తొలి 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 13న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించింది.

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. గత కొన్ని రోజులుగా న్యాయపరమైన అడ్డంకులు రావడంతో ఫలితాల విడుదల సాధ్యం కాలేదు. అయితే.. ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 13న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించింది టీఎస్‌పీఎస్‌సీ. అధికారిక వెబ్‌సైట్‌లోకెళ్లి అభ్యర్థులు తమ ఫలితాలు చూసుకోవచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ కు సంబంధించి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తం 25,150 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్‌సీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష జూన్‌లో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.

503 గ్రూప్-1 ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ ఏప్రిల్ లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్ 16న నిర్వహించారు. అనంతరరం  నవంబర్ 15న తుది కీ ని విడుదల చేశారు. అయితే.. రిజర్వేషన్ల విషయంలో పలు అభ్యంతరాలు తల్లెత్తడంతో కొంత మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో గ్రూప్ 1 పై గందరగోళం ఏర్పడింది. తాజాగా హైకోర్టు .. ఫలితాలను విడుదల చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది.దీంతో ఫలితాల విడుదలకు లైన్ క్లీయర్ అయింది. ఈ ఎగ్జామ్ కు మొత్తం 2,86,051 మంది హాజరు కాగా..  అందులో బబ్లింగ్‌, ఇతర నిబంధనలు పాటించని 135 మందిని పక్కకు పెట్టారు. మిగిలిన 2,85,916 మంది అభ్యర్థుల ఫలితాలను విడుదల చేశారు.  

click me!