ప్రగతి భవన్‌లో గోదాదేవి కళ్యాణం.. పాల్గొన్న కేసీఆర్ దంపతులు

Siva Kodati |  
Published : Jan 13, 2023, 08:56 PM IST
ప్రగతి భవన్‌లో గోదాదేవి కళ్యాణం.. పాల్గొన్న కేసీఆర్ దంపతులు

సారాంశం

ప్రగతి భవన్‌లో జరిగిన గోదాదేవి కళ్యాణం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు

ప్రగతి భవన్‌లో జరిగిన గోదాదేవి కళ్యాణం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, శోభా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కళ్యాణ మహోత్సవం ఆనందోత్సాహాల నడుమ కన్నుల పండుగగా కొనసాగింది. హిందూ సంప్రదాయం ప్రకారం.. ప్రతి ఏడాది ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు సాగే శ్రీ ఆండాళ్ అమ్మ వారి తిరుప్పావై పాశురాల పఠనం అనంతరం, గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
సైబర్ మోసాలపై అలర్ట్ చేసిన నాగార్జున సూపర్ స్పీచ్ | Akkineni Nagarjuna Cyber Awareness Programme