TS TET Results 2022: తెలంగాణ టెట్ ఫలితాల విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే..

By Sumanth KanukulaFirst Published Jun 28, 2022, 3:58 PM IST
Highlights

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్న సంగతి  తెలిసిందే. టెట్ పరీక్ష ఫలితాలు జూన్ 27న విడుదల కానున్నట్టుగా తొలుత ప్రకటించడంతో.. అభ్యర్థులు ఆ రోజున ఫలితాల కోసం వేచిచూశారు. 

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్న సంగతి  తెలిసిందే. టెట్ పరీక్ష ఫలితాలు జూన్ 27న విడుదల కానున్నట్టుగా తొలుత ప్రకటించడంతో.. అభ్యర్థులు ఆ రోజున ఫలితాల కోసం వేచిచూశారు. ఫలితాల వెల్లడి కాకపోవడంతో నిరాశ చెందారు. అయితే తాజాగా TS TET Results 2022 తేదీపై స్పష్టత వచ్చింది. టెట్ ఫలితాలను జూలై 1వ తేదీన విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విద్యాశాఖ ప‌నితీరుపై స‌బితా ఇంద్రారెడ్డి త‌న కార్యాల‌యంలో మంగళవారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా టెట్ ఫ‌లితాల వెల్ల‌డిలో జాప్యానికి ఆస్కారం లేకుండా జులై 1న విడుద‌ల చేయాల‌ని ఆమె ఆదేశించారు.

ఇక, ఫలితాలు విడుదలైన వెంటనే.. అధికారిక వెబ్‌సైట్‌లో https://tstet.cgg.gov.in/ అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకోసం అభ్యర్థులు వారి టెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది. 

ఇదిలా ఉంటే.. జూన్ 12న నిర్వహించిన టెట్ పరీక్షను ప్రశాంతంగా ముగిసిన సంగతి త తెలిసిందే. టెట్‌ పరీక్ష పేపర్‌–1 ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు జ‌రిగింది. అలాగే పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జ‌రిగింది. ఈ ప‌రీక్ష‌కు 90 శాతం మంది హాజ‌రైన‌ట్టు క‌న్వీన‌ర్ తెలిపారు. టెట్‌కు మొత్తం 6,29,382 మంది దరఖాస్తు చేసుకోగా 5,69,576 మంది పరీక్షకు హాజరయ్యారు.

1,480 కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పేపర్-1 పరీక్షకు 3,51,468 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 3,18,506 మంది హాజరయ్యారు. అలాగే 1,203 కేంద్రాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్-2కు 2,77,900 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా వారిలో 2,51,070 మంది  హాజరయ్యారు. ఒక, ఐదేళ్లలో తర్వాత టెట్ ఎగ్జామ్‌ను నిర్వహించడంతో ఈసారి బీఈడీ అభ్యర్థులకు పేపర్ 1 రాసేందుకు అవకాశమిచ్చినట్టుగా విద్యాశాఖ పేర్కొంది.

ఇక, టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే సమయంలోనే జూన్ 27 న ఫలితాలు విడుదల చేస్తామని వెబ్ సైట్ లో పెట్టిన విషయం తెలిసిందే. టెట్ పరీక్ష ముగిసన అనంతరం కన్వీనర్ కూడా అదే విషయాన్ని వెల్లడించారు. అయితే నిన్న ఫలితాలు విడుదల  కాలేదు. దీంతో ఫలితాల విడుదల తేదీపై అధికారంగా ఎటువంటి సమాచారం లేకుండా పోయింది. తాజాగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశాలతో ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. 
 

click me!