TS TET 2022 Hall Tickets: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. నేడే హాల్ టికెట్ల విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా అంటే..

Published : Jun 06, 2022, 11:08 AM IST
TS TET 2022 Hall Tickets: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. నేడే హాల్ టికెట్ల విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా అంటే..

సారాంశం

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) హాల్ టిక్కెట్లు నేడు (జూన్‌ 6) విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ ఈరోజు సాయంత్రం హాల్ టికెట్లను విడుదల చేయనుంది. అనంతం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://tstet.cgg.gov.in/ లోకి వెళ్లి  హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) హాల్ టిక్కెట్లు నేడు (జూన్‌ 6) విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ ఈరోజు సాయంత్రం హాల్ టికెట్లను విడుదల చేయనుంది. అనంతం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి  హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల జూన్ 12వ తేదీన టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్షకు మరో ఆరు రోజుల సమయమే ఉన్నందున నేడు హాల్ టికెట్లను అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు. హాల్ టికెట్లు https://tstet.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో  అందుబాటులో ఉండనున్నాయి. 

హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు పైన పేర్కొన్న వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. TS TET హాల్ టిక్కెట్‌‌ డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ అడిగిన వివరాలు ఎంటర్ చేసి.. అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం అభ్యర్థులు వారి టెట్ దరఖాస్తు నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి. 

ఇక, జూన్ 6 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇప్పటికే అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 6,29,352 అప్లికేషన్లు అందాయని చెప్పారు. వీటిలో పేపర్ 1కు 3.51,468, పేపర్ 2కు 2,77,884 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. జూన్ 6 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. 5 ఏళ్ల తర్వాత టెట్ ఎగ్జామ్‌ను నిర్వహించడంతో పాటుగా.. ఈసారి బీఈడీ అభ్యర్థులకు పేపర్ 1 రాసేందుకు అవకాశమిచ్చామని.. అందుకే దరఖాస్తులు భారీగా వచ్చాయని చెప్పారు.టెట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు. ఎగ్జామ్ సెంటర్స్ ఎంపిక ఇప్పటికే పూర్తైయిందని చెప్పారు.  అత్యధికంగా హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

సీఐడీ విచారణకు Padi Kaushik Reddy | Sammakka-Saralamma Jatara Case | BRS MLA | Asianet News Telugu
CM Revanth Reddy Speech: ఈలోపం దేశ భవిష్యత్తుకు చాలాఇబ్బందికరం | AI Challenges | Asianet News Telugu