హైదరాబాద్ లో ఓ ఈవెంట్ మేనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ : రోజురోజుకూ హైదరాబాద్ లో అమ్మాయిలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. రొమేనియా అమ్మాయిపై gang rape ఘటన కలకలం రేపుతున్న సమయంలోనే మరో రెండు ఘటనలు హైదరాబాద్ లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
లంగర్ హౌస్ కు చెందిన మహమ్మద్ సూఫియన్ (21) Event organizer. చార్మినార్ సమీపంలో ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్న బాలికతో ఇతడికి పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటాను అంటూ ఆమెను నమ్మించాడు. ఈ నెల 30న రాత్రి అతడి ఇంటికి తీసుకు వెళ్ళాడు . మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. మరుసటి రోజు ఆమెను బట్టల షాపు వద్ద వదిలేసి వెళ్లాడు. గురువారం తీవ్రమైన కడుపునొప్పితో బాలిక బాధపడడం చూసిన తల్లి.. నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
undefined
ఇక మరో ఘటనలో రోడ్డు పక్కన వెళుతున్న 12ఏళ్ల బాలిక ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి ఒక క్యాబ్ డ్రైవర్ అతడి స్నేహితుడు కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులు కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన క్యాబ్ డ్రైవర్ షేక్ కలీం అలీ, మహ్మద్ లుక్మన్ అహ్మద్ యజ్దానీలను శుక్రవారమే అరెస్టు చేసినా.. జూబ్లీహిల్స్ కేసుపై ప్రతిపక్షాలు ఆందోళన నేపథ్యంలో విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ విషయం మీడియాకు లీక్ కావడంతో ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
వివరాల్లోకి వెడితే.. హైదరాబాద్ లో పహాడీ షరీఫ్ సమీపంలోని షాహిన్‌నగర్ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలిక సుల్తాన్ షాహీలోని తన మేనమామ ఇంట్లో ఉంటుంది. తల్లిదండ్రులను చూడాలనిపించడంతో గత మంగళవారం మే 31న సాయంత్రం 6 గంటలకు సుల్తాన్‌షాహీ నుంచి కాలినడకన బయలుదేరింది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పహాడీ షరీఫ్ కమాన్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో అటుగా కారులో వెళుతున్న క్యాబ్ డ్రైవర్ షేక్ సలీం అలీ బాలికను గమనించి ఆగాడు.
ఎక్కడికి వెళ్తున్నావ్ అంటూ మాట కలిపాడు. ఇంటివద్ద దింపేస్తానని బాలికను తన క్యాబ్ ఎక్కించుకున్నాడు. ముర్గి చౌక్ ప్రాంతంలో పని ఉందని, అది చూసుకున్నాక దింపేస్తానని చెప్పాడు. రాత్రి 10 గంటల దాకా వివిధ ప్రాంతాల్లో తిప్పి.. తన స్నేహితుడైన మహ్మద్ లుక్మన్ అహ్మద్ యజ్దానీకి ఫోన్ చేశాడు. బస్తీలోని డెక్కన్ ప్యాలెస్ వద్దకు వచ్చిన యజ్దానీ వీరి కారు ఎక్కాడు. ఇద్దరు కలిసి బాలికను కుందుర్గ్ లోని యజ్దానీ ఇంటికి తీసుకు వెళ్లారు. అక్కడే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తీవ్రంగా ఏడుస్తుండడంతో భయపడిన కలీం.. అర్ధరాత్రి తర్వాత ఆమెను కారులో సుల్తాన్ షాహీ వద్ద విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరోవైపు రాత్రి 12:15 గంటల సమయంలో బాలిక బంధువులు ఆమె కనిపించడం లేదంటూ మొగల్పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
గస్తీ బృందం బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో సుల్తాన్‌షాహీ వద్ద బాలికను గుర్తించి తీసుకువచ్చారు. తర్వాత బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. అక్కడ వాంగ్మూలం నమోదు చేసిన అధికారులు.. సామూహిక అత్యాచారం జరిగిన విషయం గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసులో అత్యాచారం సెక్షన్లను చేర్చి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.