మహిళా ప్రయాణికులూ.. దయచేసి అలా చేయొద్దు.. - టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్

By Sairam IndurFirst Published Dec 23, 2023, 4:16 PM IST
Highlights

తక్కువ దూరాలకు వెళ్లే మహిళా ప్రయాణికులు ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఎక్కకూడదని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. అలాగే అనుమతించిన స్టేజీల్లో మాత్రమే బస్సులు ఆగుతాయని, ఈ విషయంలో మహిళలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

మహాలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణలోని మహిళలందరికీ టీఎస్ ఆర్టీసీలోని పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ పథకానికి భారీగా స్పందన వస్తోంది. రికార్డు స్థాయిలో మహిళలు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే దీని అమలుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురువుతున్నాయి. దానిని నివారించేందుకు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ విజ్ఞప్తి చేశారు. 

గుడ్ న్యూస్.. 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు.. !

తక్కువ దూరాలకు వెళ్లే మహిళలు కూడా త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో వెళ్తున్నారని, దీని వల్ల దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దయచేసి అలా చేయవద్దని కోరారు. ఈ మేరకు ఆయన తన ‘ఎక్స్’ హ్యాండిల్ లో ఓ పోస్టు పెట్టారు. ‘‘మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం.’’ అని ఆయన పేర్కొన్నారు. 

ధైర్యం ఉంటే ప్రధాని మోడీపై పోటీ చేయాలి.. మమతా బెనర్జీకి బీజేపీ సవాల్..

‘‘దీంతో పాటు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోంది. ఇక నుంచి ఎక్స్‌ ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపుతారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.’’ అని పేర్కొన్నారు. మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు.
ఏపీ రాజకీయాల్లో సంచలనం .. కొత్త పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ , పేరు ఇదే

కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ‘మహాలక్ష్మీ’ పథకాన్ని డిసెంబర్ 9వ తేదీన అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. దీని ద్వారా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 

click me!