TS POLYCET Results 2022: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే..

Published : Jul 13, 2022, 11:49 AM IST
TS POLYCET Results 2022: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే..

సారాంశం

తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక, ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ బుధవారం ఉదయం TS POLYCET 2022 ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక, ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ బుధవారం ఉదయం TS POLYCET 2022 ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలో ఎంపీసీ విభాగంలో 75.73 శాతం ఉత్తీర్ణత, బైపీసీ విభాగంలో 75.81 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యార్థులు  https://polycetts.nic.in, www.sbtet.telangana.gov.in వెబ్‌సైట్లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజల్ట్స్ లింక్ క్లిక్ చేసి.. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఇక, పాలిటెక్‌ ప్రవేశాలకు నేడు నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని నవీన్‌ మిట్టల్ ప్రకటించారు.

ఫలితాలను పరిశీలిస్తే.. ఎంపీసీ విభాగంంలో కరీంనగర్ జిల్లాకు చెందిన గుజ్జుల వర్షిత మొదటి ర్యాంకు, సూర్య పేట్ జిల్లాకు చెందిన చింతలూరి సాయి రోహిత్ రెండో ర్యాంకు సాధించారు. బైపీసీ విభాగంలో మేడ్చల్ జిల్లా చేందిన చంద్ర శేఖర్ మొదటి ర్యాంకు, వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మణి‌చరణ్ రెడ్డి రెండవ ర్యాంకు సాధించారు.

ఇక, పదో తరగతి తర్వాత డిప్లోమా కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్ పరీక్షను నిర్వహించబడుతుంది. పాలిసెట్ పరీక్షను జూన్ 30వ తేదీన నిర్వహించారు. మొత్తం 365 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 1,13,979 మంది నమోదు చేసుకోగా.. 91.62 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం