ఆ విషయంలో తెలంగాణ నెంబర్ 2 అయింది

First Published Oct 10, 2017, 4:11 PM IST
Highlights
  • నవజాత శిశు సంరక్షణలో మనం నెంబర్ 2
  • ప్రకటించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
  • సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే అగ్రస్థానం :  వైద్య మంత్రి లక్ష్మారెడ్డి

మొన్న ఓపి, ఐపీ పెరిగినందుకు అభినందన అవార్డు, నిన్న కేసీఆర్ కిట్ల పథకానికి మెరిట్ అవార్డు, స్కాచ్ అవార్డులు, ఆరోగ్యశ్రీ మొబైల్ యాపీకి మరో ప్రత్యేక అవార్డు...ఇలా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు అవార్డుల పంట పండుతున్నది. తాజాగా ఈ రోజు నవజాత శిశి సంరక్షణలో మరో అవార్డు....వచ్చింది.

నవజాత శిశు సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ టూ గా నిలిచింది. నవజాత శిశు సంరక్షణ ఇండెక్స్ ఆధారంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలంగాణ దేశంలో  రెండో అత్యుత్తమ దేశంగా గుర్తించింది. మొదటి రాష్ట్రంగా హరియాణ నిలిచింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం జాతీయ శిశు ఆరోగ్య సమీక్షలో ఈ విషయాన్ని ప్రకటించింది. కాగా సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ధి చెందడంతో పాటు అవార్డులు కూడా పొందుతున్నదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. కేసీఆర్ కి కృతజ్ఞతలు చెబుతూ, ఇందుకు సహకరించిన అందరినీ మంత్రి అభినందించారు.

దేశంలో రెండో స్థానంలో నిలబడటం వెనుక తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కృషి ఎంతగానో  ఉంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడాలేని విధంగా నవజాత శిశు సంరక్షణకు పాటుపడుతున్నది.

 

SNCU (ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాలు)

తెలంగాణ రాష్ట్ర0 ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్, మాత శిశు సంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల ప్రభుత్వ దవాఖానాల్లో సౌకర్యాలు పెరిగి IMR ( INFANT MORTALITY RATE ) 39 నుండి 31కి తగ్గి0దని, ఇది జాతీయ సగటు లో సగం. దీనితో మన రాష్ట్రం దేశం లోని ఆరోగ్యసేవలో అత్యుత్తమ రాష్ట్రాలైన కేరళ , తమిళనాడు సరసన నిలిచి0దని వైద్య ఆరోవ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.

రాష్ట్ర0లో ప్రస్తుతం 21 SNCU నవజాత శిశు సంరక్షణ కేంద్రాలున్నాయి. 7 SNCU లు  ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రతి జిల్లాకు ఒక SNCU ఏర్పాటు చేయడానికి 7 క్రొత్త SNCU లకు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని మంత్రి తెలిపారు.

గత సంవత్సరంలో 21 SNCU లలో 29,000 శిశువులను  చేర్చుకుని సంరక్షించడం

 జరిగి0దని, SNCU ల్లో చేర్చుకున్న శిశువుల్లో 75% కన్నా ఎక్కువ మంది శిశువులు ఆరోగ్యంగా ఇంటికి పంపించడం జరిగినదని మంత్రి వివరించారు.

సాధారణంగా జన్మించే 15% శిశువులకు SNCU సేవలు అవసరమవుతున్నాయని, తెలంగాణాలో సంవత్సరానికి 6,50,000 శిశువులు జన్మిస్తున్నారు. వీరిలో లక్ష మంది పిల్లలకు SNCU సేవలు అవసరమౌతాయి. ఈ అంచనాలకు అనుగుణంగా SNCU లను ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వంని మంత్రి చెప్పారు.

అలాగే SNCU అన్నింటిలో  ventilator లాంటి ఇంకా  మెరుగైన సౌకర్యాలను కల్పించి IMR ను ఇంకా తగ్గించడానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తున్నదని మంత్రి చెప్పారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/bJeE3b

 

click me!