
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్సిటీలో వీసీల నియామకానికి అనుమతివ్వాలన్న ప్రభుత్వ వినితిని సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది.
తెలంగాణలో వీసీల నియామక పిటిషన్‌పై సుప్రీంలో శుక్రవారం విచారణ జరిగింది. తెలంగాణ తరపున అటార్నీ జనరల్ ముఖుల్ రోహిత్గి వాదనలు వినిపించారు.
యూజీసీ మార్గదర్శకాల ప్రకారం వీసీల నియామకాలు చేపడతామని కోర్టుకు విన్నవించింది.
మూడు వర్సిటీలకు వీసీల నియామకానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
ప్రభుత్వ వినతిని సుప్రీం కోర్టు అంగీకరిస్తూ మూడు వర్సిటీలకు వీసీల నియామకానికి అనుమతినిచ్చింది.