ఎన్నికల ప్రచారంలో పాడె మోసిన స్పీకర్ మధుసూదనాచారి

By sivanagaprasad kodatiFirst Published Oct 23, 2018, 9:27 AM IST
Highlights

ఎన్నికల ప్రచారం అంటే చాలు నేతాశ్రీలు చేసే స్టంట్లు మామూలుగా ఉండదు.. ఇస్త్రీ చేయడం, పిండి రుబ్బడం, చిన్నారులను ఎత్తుకోవడం, ఆటోలు నడపటం అమ్మో .. అయితే వీరందరికి భిన్నంగా వ్యవహరించారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, భూపాల్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదనాచారి. 

ఎన్నికలు సమీపిస్తుంటంతో అభ్యర్థులు, నేతలు, పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారు. ఆయన మాటను కార్యకర్తలు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుసూదానాచారి ప్రచారంలో దూసుకుపోతున్నారు.

భూపాల్‌పల్లి పట్టణంలోని రాంనగర్‌ కాలనీలో ప్రచారం చేస్తుండగా.. పెండ్యాల కిషన్ అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో మరణించినట్లు తెలిసింది. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గండ్ర సత్యనారాయణరావు అప్పటికే మృతుడి కుటుంబాన్ని పరామర్శించినట్లుగా సమాచారం అందింది.

దీంతో స్పీకర్ వెంటనే పరామర్శించడానికి బయలుదేరారు. అయితే అప్పటికే మృతదేహాన్ని అంత్యక్రియల క్రితం తీసుకెళుతున్నారు.. ఈ క్రమంలో స్పీకర్ ఎదురెళ్లి పాడే మోశారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తలా ఓ చేయి వేశారు. ఈ దృశ్యాన్ని చూసిన జనం స్పీకర్ చర్యను మెచ్చుకున్నారు. 

100సీట్లు మాట దేవుడెరుగు కేసీఆర్ కు 104 జ్వరం ఖాయం

కేసీఆర్ పై మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం

టీఆర్ఎస్ అభ్యర్థులకు క్లాస్ తీసుకున్న కేసీఆర్

అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం:100స్థానాల్లో విజయంపై ధీమా

click me!