రైట్.. రైట్: ఏపీ, తెలంగాణ ఆర్టీసీ మధ్య కుదిరిన ఒప్పందం, నడవనున్న బస్సులు

By narsimha lodeFirst Published Nov 2, 2020, 4:31 PM IST
Highlights

సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న టీఎస్, ఏపీఎస్ఆర్టీసీల మధ్య  ఒప్పందం సోమవారం నాడు కుదిరింది.దీంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి

హైదరాబాద్: సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న టీఎస్, ఏపీఎస్ఆర్టీసీల మధ్య  ఒప్పందం సోమవారం నాడు కుదిరింది.దీంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడిపే విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది.తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సమక్షంలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు కొత్త ఒప్పందంపై సోమవారం నాడు సంతకాలు చేశారు.

రెండు రాష్ట్రాల మధ్య కిలోమీటర్ల చొప్పున ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకొన్నారు. ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ఆర్టీసీ 826 బస్సులను నడపనుంది. తెలంగాణలో ఏపీఎస్ఆర్టీసీ 638 బస్సులను నడపనుంది.  విజయవాడ రూట్ లో 273 బస్సులను తెలంగాణ ఆర్టీసీ బస్సులను నడపనుంది.ఇదే రూట్ లో ఏపీఎస్ఆర్టీసీ 192 బస్సులను నడపాలని రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది.

కర్నూల్-హైద్రాబాద్ సెక్టార్ లో 213 బస్సులు తిప్పనున్న టీఎస్ ఆర్టీసీ, మరో వైపు శ్రీశైలం హైద్రాబాద్ మార్గంలో తెలంగాణ ఆర్టీసీ 62 బస్సులను నడపనుంది.ఈ రూట్ లో ఏపీఎస్ఆర్టీసీ ఒక్క బస్సును కూడ నడపదు.

గుంటూరు, హైద్రాబాద్ వయా వాడపల్లి రూట్ లో 57 బస్సులు తిప్పాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకొంది. మరోవైపు ఇదే రూట్ లో ఏపీఎస్ఆర్టీసీ 88 బస్సులను నడపనుంది. 

మాచర్ల సెక్టార్ లో టీఎస్ఆర్టీసీ 66 బస్సులు, ఏపీ బస్సులు 61లను నడపాలని ఒప్పందం చేసుకొంది. నూజివీడు, తిరువూరు, విజయవాడ, భద్రాచలం, విజయవాడ రూట్ లో 48 టీఎస్ఆర్టీసీ బస్సులు, 45 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడపనుంది.సత్తుపల్లి -ఏలూరు రూట్‌లో టీఎస్ ఆర్టీసీ 62, ఏపీఎస్ఆర్టీసీ 28 బస్సులు నడపనుంది.

ఖమ్మం, జీలుగుమిల్లి, జంగారెడ్డి గూడెం రోడ్డులో 35 టీఎస్ ఆర్టీసీ, 58 ఏపీ బస్సులు నడపనుంది. తెలంగాణలో 1,60, 999 కి.మీ. దూరం ఏపీఎస్ఆర్టీసీ బస్సులను నడపనుంది.ఏపీలో 1,61, 258 కి.మీ దూరం తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడుపుతుంది.


 

click me!