న్యూజిలాండ్‌ మంత్రిగా భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్.. కేటీఆర్ అభినందనలు..

By AN TeluguFirst Published Nov 2, 2020, 3:33 PM IST
Highlights

న్యూజిలాండ్‌  ప్రధానమంత్రి  జెసిండా ఆర్డెర్న్‌ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్న భారతీయ సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ (41)కు తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.  

న్యూజిలాండ్‌  ప్రధానమంత్రి  జెసిండా ఆర్డెర్న్‌ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్న భారతీయ సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ (41)కు తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.  

ప్రధాని జెసిండా మంత్రివర్గంలో చేరనున్న ప్రియాంకకు అభినందనలు అంటూ ఆయన సోమవారం ట్వీట్‌​  చేశారు. న్యూజిలాండ్‌ దేశంలో ఈ స్థాయికి ఎదిగిన తొలి భారతీయురాలు అంటూ కేటీఆర్‌‌ శుభాకాంక్షలు తెలిపారు.  అలాగే తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జెసిండాకు కూడా ఆయన అభినందించారు. 

మరోవైపు భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ (41) జెసిండా మంత్రివర్గంలో కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్‌ మంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించ నున్నారు.  గృహ హింస బాధిత మహిళలు, వలస కార్మికుల  తరపున  పోరాడుతున్న ప్రియాంకా  2017లో తొలిసారి లేబర్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

ఇటీవల ఎన్నికల్లో రెండోసారి ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించిన జెసిండా తాజాగా తన క్యాబినెట్‌ను విభిన్నంగా తీర్చిద్దిదారు. ప్రతిభ, యోగ్యత కలిగినవారికే తన మంత్రివర్గంలో చోటిచ్చామని ఇందుకు చాలా గర్వంగా ఉందని ఆమె ప్రకటించారు. రాబోయే మూడేళ్ళు తాము సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని ప్రధాని జెసిండా వెల్లింగ్టన్లో విలేకరులతో అన్నారు. కరోనా మహమ్మారి సంక్షోభంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి జారుకుందని, ఈ ప్రభావం తమపై కూడా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆర్థిక పునరుద్ధరణను వేగవంతం చేయనున్నామనే విశ్వాసాన్ని ఆమె వెల్లడించారు.
 

click me!