
తెలంగాణ నూతన మంత్రివర్గానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం చేసిన కొత్త మంత్రులను అభినందించారు.
‘కొత్త మంత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో మీరంతా తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారన్న నమ్మకం నాకుంది’ అని పేర్కొన్నారు.
రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్.. ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి. శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డిలతో ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే.