జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే రిపీట్, అది డూప్లికేట్ సర్వే: కేసీఆర్

Published : Dec 02, 2018, 08:24 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే రిపీట్, అది డూప్లికేట్ సర్వే: కేసీఆర్

సారాంశం

 టీఆర్ఎస్ వందకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తోందని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు


హైదరాబాద్: టీఆర్ఎస్ వందకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తోందని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. తప్పుడు సర్వేలను ప్రజా కూటమి విడుదల చేయనుందని కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు.

ఆదివారం నాడు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ లో  టీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత ఆయన ప్రసంగించారు.తనకు ఖచ్చితమైన సమాచారం ఉందన్నారు. చంద్రబాబునాయుడు, కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి తప్పుడు సర్వేను  విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. 

ఇవాళే తనకు మరో సర్వే రిపోర్టు వచ్చిందన్నారు. టీఆర్ఎస్ వందకు పైగా అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించనుందన్నారు. తాను వంద సభల్లో తిరిగి ప్రజల నాడిని అర్ధం చేసుకొని చెబుతున్నట్టు చెప్పారు.

ఓ పత్రిక, చంద్రబాబునాయుడు డూప్లికేట్ సర్వేను విడుదల చేసే అవకాశం ఉందని కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు.జంట నగరాల్లో కూడ టీఆర్ఎస్ గణనీయమైన స్థానాలను కైవసం చేసుకొంటుందన్నారు. జీహెచ్ఎంసీ ఫలితాలే జంట నగరాల్లో పునరావృతం కానున్నాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

హైద్రాబాద్ వాసుల మధ్య చిచ్చు: బాబుపై కేసీఆర్ సంచలనం

టీఆర్ఎస్ మేనిఫెస్టో: ఉద్యోగుల రిటైర్మెంట్ మూడేళ్లు పెంపు


 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ