టీఆర్ఎస్ మేనిఫెస్టో: ఉద్యోగుల రిటైర్మెంట్ మూడేళ్లు పెంపు

By narsimha lodeFirst Published Dec 2, 2018, 6:44 PM IST
Highlights

టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆర్ ఆదివారం నాడు విడుదల చేశారు. 
 

 

హైదరాబాద్: ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును మూడేళ్ల పాటు పెంచుతామని టీఆర్ఎస్ ప్రకటించింది. గతంలోని పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా 24 పథకాలను మేనిఫెస్టోలో టీఆర్ఎస్ చేర్చింది. పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరీని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం నాడు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్ఎస్ మేనిఫెస్టోను టీఆర్ఎస్ విడుదల చేశారు.టీఆర్ఎస్ మేనిఫెస్టోలో 24 అంశాలను చేర్చారు.వృద్దాప్య వయస్సును 57 ఏళ్లకు తగ్గించారు.  టీఆర్ఎస్ తాత్కాలిక మేనిఫెస్టోలోని అంశాలతో పాటు ఇతర అంశాలను కూడ చేర్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు మేనిఫెస్టోలో కేసీఆర్ ప్రకటించారు. ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిని మూడేళ్ల పాటు పెంచుతూ టీఆర్ఎస్ ప్రకటించింది.ఆర్థికంగా వెనుకబడిన కులాలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

ప్రభుత్వ ఉద్యోగల వేతన సవరణ చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61కు పెంచుతామని ప్రకటించింది.పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరీని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రెడ్డి, వైశ్య కార్పోరేషన్లకు ఫెడరేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం రూ.6 లక్షల ఆర్థిక సహాయాన్ని ఇవ్వనున్నట్టు టీఆర్ఎస్  హామీ ఇచ్చింది.రైతు బంధు పథకం కింద ఎకరాకు ప్రతి ఏటా రూ. 10వేల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు కేసీఆర్ హామీ ఇచ్చారు.

ప్రతి ఏటా ప్రతి రైతుకు లక్ష రూపాయాల పంట రుణాన్ని మాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. కంటి వెలుగు తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో కేసీఆర్ ప్రకటించారు.

గిరిజనులు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం  కేంద్రంతో పోరాడనున్నట్టు మేనిఫెస్టోలో ప్రకటించింది.సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకొన్న వారికి పట్టాలు ఇస్తామని మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది.

ఆసరా పెన్షన్లను రూ.2016కు పెంచుతామని ప్రకటించారు.వికలాంగుల పెన్షన్లను రూ. 3016 పెంచుతామని టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. బీడీ కార్మికుల పీఎఫ్ కటాప్ డేట్ 2018 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. 

నిరుద్యోగ భృతి రూ. 3016 ఇస్తున్నట్టు టీఆర్ఎస్ హామీ ఇచ్చింది.రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతిని ఇవ్వనున్నట్టు టీఆర్ఎస్ హమీ ఇచ్చింది.వివిధ కులాల కేటగిరి మార్పు డిమాండ్లపై సానుకూలంగా పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు.

 

click me!