మా నాయకుడికి టికెట్ ఇవ్వలేదు.. టవర్ ఎక్కిన అభిమాని

By ramya neerukondaFirst Published Sep 7, 2018, 9:58 AM IST
Highlights

తమ నాయకుడు సునీల్‌రెడ్డికి ఇవ్వకుండా అధిష్టానం అన్యాయం చేసిందని ఆరోపిస్తూ టవరెక్కాడు. పోలీసులు అక్కడికి చేరుకుని కిందికి రమ్మని కోరినా ససేమిరా అన్నాడు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా  గురువారం తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్నారు. కాగా.. రానున్న ఎన్నికల్లో భాగంగా తన పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థు ల జాబితాను కూడా కేసీఆర్ ప్రకటించారు. దీంతో కొందరు ఆశావాహులకు టికెట్లు దక్కలేదు. టికెట్ ఆశించి భంగపడిన ఓ వ్యక్తి అభిమాని గురువారం రాత్రి కలకలం రేపాడు.

పెద్దపల్లి జిల్లా మంథనిలో రాహుల్‌రెడ్డి అనే తెరాస కార్యకర్త గురువారం రాత్రి సెల్‌‌ టవరెక్కి కలకలం రేపాడు. మంథని తెరాస టికెట్‌ను తమ నాయకుడు సునీల్‌రెడ్డికి ఇవ్వకుండా అధిష్టానం అన్యాయం చేసిందని ఆరోపిస్తూ టవరెక్కాడు. పోలీసులు అక్కడికి చేరుకుని కిందికి రమ్మని కోరినా ససేమిరా అన్నాడు. తెరాస నాయకుడు సునీల్‌రెడ్డి వచ్చి పిలవడంతో చాలాసేపటి తరువాత దిగి వచ్చాడు. ఆ యువకుడిని పోలీసులు ఠాణాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఎస్సై మహేందర్‌తో‌ సునీల్‌రెడ్డి, ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. 
 

click me!