తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఏం చేద్దాం: చంద్రబాబు

By rajesh yFirst Published 6, Sep 2018, 9:07 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులు పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ రద్దు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం..కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చెయ్యడం జరిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సైతం అలర్ట్ అయ్యారు. 

అమరావతి: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులు పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ రద్దు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం..కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చెయ్యడం జరిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సైతం అలర్ట్ అయ్యారు. 

టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ప్రకటనపై నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈనెల 8న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి దిశానిర్దేశం చెయ్యనున్నారు.  

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ స్నేహహస్తాన్ని అందించడంతోపాటు వామపక్ష పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ పార్టీనీ ఓడించేందుకు కాంగ్రెస్, టీడీపీతోపాటు వామపక్ష పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడితే ఫలితాలు ఎలా ఉంటాయన్న కోణంలో కూడా చంద్రబాబు నాయుడు చర్చించినట్లు తెలుస్తోంది. ఈనెల 8న తెలంగాణలో టీడీపీ అభ్యర్థుల కసరత్తు, మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Last Updated 9, Sep 2018, 12:28 PM IST