''ముందస్తు ఎన్నికల బిజెపి సిద్దం...పాలమూరులో అమిత్ షా పర్యటన''

By Arun Kumar PFirst Published Sep 6, 2018, 9:00 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ రద్దవడంతో త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ముందస్తు ఎన్నికల కోసం అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ బిజెపి పార్టీ ఎన్నికలకు సిద్దమవుతోంది. ఈ నెల 15 వ తేదీన ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు తెలంగాణలో పర్యటించనున్నట్లు అంబర్ పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తెలిపారు. పాలమూరు జిల్లాలో అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ అభ్యర్ధులకు అన్నివిధాల సహకరించడానికి   అన్ని గ్రామాల్లో పోలింగ్ బూత్ కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఎన్నికల కోసం అన్ని రకాలుగా కార్యకర్తలను, నాయకులను సిద్దం చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారని ఆయన విమర్శించారు. కేవలం ప్రజలే కాదు టీఆర్ఎస్ మంత్రులు,నాయకులు, కార్యకర్తలతో పాటు కేసీఆర్ కుటుంబం కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
 
click me!