ప్రారంభమైన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం: కీలకాంశాలపై చర్చ

By narsimha lodeFirst Published Feb 7, 2021, 3:35 PM IST
Highlights

తెలంగాణ భనన్ లో ఆదివారం నాడు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో  పార్టీ సంస్థాగత ఎన్నికల విషయంతో పాటు ఇతర అంశంపై చర్చించనున్నారు.


హైదరాబాద్: తెలంగాణ భనన్ లో ఆదివారం నాడు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో  పార్టీ సంస్థాగత ఎన్నికల విషయంతో పాటు ఇతర అంశంపై చర్చించనున్నారు.నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉఫ ఎన్నిక, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై కూడ కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయనున్నారు. 

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలపై కూడ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన సూచనలు  చేయనున్నారు.గత ఏడాది రాష్ట్రంలో సుమారు 60 లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేశారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది అంతకంటే ఎక్కువ సభ్యత్వాన్ని చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.

సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పటి నుండి ఎప్పటివరకు పూర్తి చేయాలో సీఎం షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు సంస్థాగత ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయడంపై పార్టీ నేతలకు సూచనలు చేయనున్నారు.

ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. అంతేకాదు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహాసభ నిర్వహణ వంటి అంశాలపై కూడ ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాదు పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై కూడ ఈ సమావేశంలో చర్చించనున్నారు.

click me!