శ్రీలేఖగా మారిన శ్రీకాంత్... ప్రియుడికి దూరమై సూసైడ్, వీడియో కాల్ మాట్లాడుతూనే...

Arun Kumar P   | Asianet News
Published : Feb 07, 2021, 07:31 AM ISTUpdated : Feb 07, 2021, 07:35 AM IST
శ్రీలేఖగా మారిన శ్రీకాంత్... ప్రియుడికి దూరమై సూసైడ్, వీడియో కాల్ మాట్లాడుతూనే...

సారాంశం

ప్రేమ విఫలమైన ఓ హిజ్రా తన బంధువుతో వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడుతూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.  

జడ్చర్ల: తాను ప్రేమించిన వాడు వేరు యువతిని పెళ్ళాడటం తట్టుకోలేకపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విచిత్ర సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.  ఇలా ప్రేమ విఫలమైన హిజ్రా తన బంధువుతో వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడుతూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.  

వివరాల్లోకి వెళితే...  మహబూబ్ నగర్  జిల్లా జడ్చర్ల సమీపంలోని నక్కలబండ తాండాకు చెందిన శ్రీకాంత్(18) కు చిన్నపుడే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో అతడు అమ్మమ్మ వారింట్లోనే వుండేవాడు.  అయితే కొద్దిరోజుల క్రితం ఏమయ్యిందో తెలీదు కానీ అతడు హటాత్తుగా కనిపించకుండా పోయాడు. ఇలా కనిపించకుండా పోయిన అతడు హిజ్రాగా మారినట్లు తాజాగా బయటపడింది. 

అయితే తాజాగా శ్రీకాంత్ తన మేనమామ కొడుకు ఫోన్ కు వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. తాను ప్రస్తుతం కడపలో వుంటున్నట్లు... హిజ్రాగా మారినట్లు తెలిపాడు.  అంతేకాకుండా తాను ఓ యువకుడిని ప్రేమించానని... కానీ అతడు వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించినవాడు దూరమవడాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటూ వీడియో కాల్ మాట్లాడుతూనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
దీంతో శ్రీకాంత్ బందువులు పోలీసులకు సమాచారం అందించారు.  దీంతో వారు కడప పోలీసుల సాయంతో  శ్రీకాంత్‌ అలియాస్‌ శ్రీలేఖను గుర్తించి అదేరోజు కడప రిమ్స్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ