కేసీఆర్‌పై అభ్యంతరకర వీడియోలు .. తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ ఫిర్యాదు

By Siva KodatiFirst Published Aug 24, 2021, 9:49 PM IST
Highlights

తీన్మార్‌ మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం. జర్నలిస్టు వృత్తిని అడ్డుపెట్టుకుని యూట్యూబ్ అడ్డాగా సీఎంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై నమోదైన కేసుల నుంచి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీఆర్ఎస్ సోషల్‌ మీడియా కన్వీనర్లు పోలీసులకు తెలిపారు.

ప్రముఖ పాత్రికేయుడు తీన్మార్‌ మల్లన్నపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరిచేలా వీడియోలు రూపొందిస్తున్నారంటూ టీఆర్ఎస్ సోషల్‌ మీడియా విభాగం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జర్నలిస్టు వృత్తిని అడ్డుపెట్టుకుని యూట్యూబ్ అడ్డాగా సీఎంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై నమోదైన కేసుల నుంచి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీఆర్ఎస్ సోషల్‌ మీడియా కన్వీనర్లు పోలీసులకు తెలిపారు. ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా మల్లన్నపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీని వారు కోరారు.  

Also Read:తీన్మార్ మల్లన్నకు నోటీసులు.. కేసీఆర్ కు రాజకీయ సమాధి కడతానంటూ హెచ్చరిక..

కాగా, తీన్మార్ మల్లన్న కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల మొదట్లో నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థ మాజీ ఉద్యోగి ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా పరిగణిస్తూ సి ఆర్ పి ఎస్ 41ఎ సెక్షన్ కింద వీటిని ఇచ్చారు. పీర్జాదిగూడ లోని సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన పోలీసులు మొత్తం 12 హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షల నిమిత్తం రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్ లాబరేటరీ పంపనున్నారు. నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆధారాలను బట్టి న్యాయస్థానానికి నివేదిక అందజేస్తారు.

click me!