హాస్పిటల్ దోపిడీపై కేటీఆర్ సీరియస్... వసూలుచేసిన ఫీజు తిరిగిచ్చిన యాజమాన్యం

By Arun Kumar PFirst Published Jun 4, 2021, 11:57 AM IST
Highlights

హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ దోపిడీ మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లగా... వెంటనే స్పందించిన హాస్పిటల్ యాజమాన్యం బాధిత కుటుంబం నుండి వసూలుచేసిన ఫీజును తిరిగిచ్చింది. 

భువనగిరి: సామాన్యులను కరోనా పేరుతో హాస్పిటల్స్ ఎలా దోచుకుంటున్నాయో తెలియజేసే సంఘటన ఇది. హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ దోపిడీ మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లగా... వెంటనే స్పందించిన హాస్పిటల్ యాజమాన్యం బాధిత కుటుంబం నుండి వసూలుచేసిన ఫీజును తిరిగిచ్చింది. 

వివరాల్లోకి వెళితే... యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్ పేటకు చెందిన చిలుకూరి రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇటీవల కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడు చికిత్స కోసం ఎల్బీ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. ఆ హాస్పిటల్ లో అతడు 15రోజులు చికిత్సపొందగా రూ.7లక్షల బిల్లును వసూలు చేశారు. r

read more  చాయ్ వాలా దయనీయ పరిస్థితి... ఆపన్నహస్తం అందించిన కేటీఆర్

సదరు ప్రైవేట్ హాస్పిటల్ నుండి గాంధీ ఆస్పత్రికి రవీందర్ ను తరలించగా అక్కడ అతడి పరిస్థితి విషమంగా మారడంతో మరణించాడు. ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు పెట్టి వైద్యం చేయించిన అతడి ప్రాణాలు మాత్రం దక్కలేదు. దీంతో బాధిత కుటుంబం ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ గురించి చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి తెలియజేశారు. 

వెంటనే సదరు హాస్పిటల్ కరోనా చికిత్స పేరిట దోపిడీకి పాల్పడుతోందని మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు వెంకట్ రెడ్డి. ఈ వ్యవహారంపై కేటీఆర్ కూడా స్పందించారు. దీంతో దిగివచ్చిన హాస్పిటల్ యాజమాన్యం చెల్లించిన ఫీజులో రూ.4లక్షలు తిరిగిచ్చింది. మృతుడి సోదరుడి ఖాతాలో ఈ డబ్బును జమ చేసింది. 


 

click me!