
హైదరాబాద్: Paddy ధాన్యం కొనుగోలు అంశంపై ఆందోళనలు మరింత తీవ్రం చేయాలిTRS బావిస్తుంది. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ విషయమై కేంద్రం వైఖరిని చూసిన మీదట ఆందోళనలు మరింత పెద్ద ఎత్తున చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం అభిప్రాయంతో ఉంది.
గత వారం రోజుల క్రితం టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంలో వరి ధాన్యం కొనుగోలు అంశంపై Centre పై పోరాటానికి సంబంధించి టీఆర్ఎస్ చీఫ్, Telangana సీఎం KCR దిశా నిర్ధేశం చేశారు. పంజాబ్ రాష్ట్రం నుండి వరి ధాన్యం కొనుగోలు చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్రం నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తోనే తెలంగాణ కు చెందిన మంత్రుల బృందం Delhi కి వెళ్లింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి niranjan Reddy నేతృత్వంలో పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు కేంద్ర మంత్రి Piyush Goyal తో ఈ నెల 24న భేటీ అయ్యారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పు బట్టారు. అన్ని రాష్ట్రాల్లో ఎలా వరిధాన్యం సేకరిస్తున్నామో తెలంగాణ నుండి కూడా అదే తరహలో ధాన్యం సేకరిస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.
వరి ధాన్యం కొనుగోలు విషయమై కేసీఆర్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.ఈ నెల 25న తెలంగాణ మంత్రులు కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ విషయాలను సీఎంకు వివరించారు. ఏప్రిల్ 2 తర్వాత వరి ధాన్యం కొనుగోలుపై ఉద్యమాన్నిఉధృతం చేయాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే స్థానిక సంస్థలు వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ చేసిన తీర్మాలను ప్రధానికి పంపుతున్నారు. ఏప్రిల్ 2వ తేదీ నాటికి ఈ తీర్మానాలు పంపడం పూర్తి చేయనున్నారు. మరో వైపు వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ప్రతి ఇంటిపై నల్ల జెండాలను ఆవిష్కరించనున్నారు. అంతేకాదు జాతీయ రహదారులపై దిగ్భంధం చేయాలని కూడా టీఆర్ఎస్ భావిస్తుంది. ఢిల్లీలో లేదా హైద్రాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.
వరి ధాన్యం కొనుగోలు విషయమై BJP తీరును నిరసిస్తూ వరంగల్ బీజేపీ కార్యాలయం ముందు వడ్లు పోసి టీఆర్ఎస్ నిరసనకు దిగింది. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కూడా వరి ధాన్యం పోసి నిరసనకు దిగుతామని కూడా టీఆర్ఎస్ ఇప్పటికే హెచ్చరించింది.
వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్రంపై టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు అదే స్థాయిలో బీజేపీ నుండి ఎదురు దాడి సాగుతుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన నేతలు కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పు బడుతున్నారు. వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేసీఆర్ సర్కార్ రైతులను ఎలా తప్పుదోవ పట్టిస్తుందనే విషయాన్ని వివరిస్తున్నారు.