పార్టీ మారాల్సిన అవసరం లేదు:తేల్చేసిన కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి

Published : Mar 27, 2022, 09:45 AM IST
పార్టీ మారాల్సిన అవసరం లేదు:తేల్చేసిన కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి

సారాంశం

కాంగ్రెస్ పార్టీని తాను వీడడం లేదని  మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. పార్టీ మార్పుపై తనపై వస్తున్న ప్రచారాన్ని మహేశ్వర్ రెడ్డి ఖండించారు. 

హైదరాబాద్: తెలంగాణలో Congressపార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు పార్టీలోనే కొనసాగుతానని మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ వ్యవహరాల అమలు కమిటీ చైర్మెన్  Maheshwar Reddy చెప్పారు.పార్టీ మారుతున్నారని తనపై సాగుతున్న ప్రచారాన్ని మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.  శనివారం నాడు ఆయన Gandhi Bhavan లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందన్నారు. పన్నుల భారం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతుందన్నారు.. RTC  ఛార్జీలను పెంచేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ఇప్పటికే Electricity చార్జీలను పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్రం, రాష్ట్రం కూడా నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎన్నికల హామీలను  కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు. BJP , TRS లు వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకొంటున్నాయని ఆయన విమర్శించారు. రైతుల పక్షాన తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని మాజీ మంత్రి konda Surekha కుటుంబం కూడా స్పష్టం చేసింది. Warangaal East నుండి సురేఖ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్సీ Konda Murali  స్పష్టం చేశారు. కొండా సురేఖ కుటుంబం congress పార్టీని వీడనుందనే ప్రచారానికి  మురళి ప్రకటనతో తెరపడింది. Huzurabad అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయమై సురేఖ అభ్యర్ధిత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలించింది. కానీ  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చివరకు వెంకట్ వైపు మొగ్గు చూపింది.  ఈ సమయంలో వరంగల్ తూర్పుతో పాటు మరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని  కొండా సురేఖ్ ఫ్యామిలీ కోరినట్టుగా అప్పట్లో ప్రచారం సాగింది. అయితే ఈ విషయమై స్పష్టత రాకపోవడంతో హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సురేఖ దూరమైందని ప్రచారం సాగింది. దీంతోనే అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు సురేఖ కుటుంబం దూరంగా ఉంటుందనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే ఈ  ఈ విషయమై తన అనుచరులకు కొండా మురళి స్పష్టత ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. 

వచ్చే ఎన్నికలను కాంగ్రెస్ , బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసకొంటున్నాయి. కేసీఆర్ తీసుకొంటున్న నిర్ణయాలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పోరులో బీజేపీ కంటే కాంగ్రెస్ కొంత వెనుకబడిందనే  అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu