గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటర్ల నమోదుపై టీఆర్ఎస్ కసరత్తు

Published : Sep 21, 2020, 10:13 PM IST
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటర్ల నమోదుపై టీఆర్ఎస్ కసరత్తు

సారాంశం

హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్  ఇప్పటి నుండే కసరత్తు చేస్తోంది. ఓటర్ల నమోదు పై టీఆర్ఎస్ కేంద్రీకరించింది.


హైదరాబాద్: హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్  ఇప్పటి నుండే కసరత్తు చేస్తోంది. ఓటర్ల నమోదు పై టీఆర్ఎస్ కేంద్రీకరించింది.

వచ్చే ఏడాదిలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.గత టర్మ్ లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధి రామచందర్ రావు విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి ఓటమి పాలయ్యాడు.

దీంతో ఈ దఫా ఎన్నికలపై టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. అర్హులైన వారందరిని ఓటర్లుగా నమోదు చేయించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

ఈ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ను బరిలోకి దింపే అవకాశం ఉందని సమాచారం. రెండు సీట్లను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్ ప్రజా ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించారు. మరోసారి కూడ ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం కానున్నారు. 

also read:టిక్కెట్ల కోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ: మధ్యలో కోదండరామ్, ఎవరికి దక్కునో?

సోమవారం నాడు  హైద్రాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రతి డివిజన్ పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్ లను గుర్తించి  ఓటరుగా నమోదు చేయించాలని మంత్రి తలసాని  శ్రీనివాస్ యాదవ్ కోరారు. 

కార్పోరేటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున కార్పోరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే


 

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!