ఆ విషయం తలసానికి తెలియదేమో, అందుకే చాలెంజ్: మల్లుభట్టి విక్రమార్క విమర్శ

By narsimha lode  |  First Published Sep 21, 2020, 9:41 PM IST

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో కాగితాలపై ఉన్న లెక్కకు క్షేత్రస్థాయిలో చూపించలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.


హైదరాబాద్:డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో కాగితాలపై ఉన్న లెక్కకు క్షేత్రస్థాయిలో చూపించలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించిన పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. కానీ తనకు 3428 ఇళ్లు మాత్రమే చూపించారని ఆయన చెప్పారు.

Latest Videos

undefined

also read:డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిశీలనకు బ్రేక్: వెనుదిరిగిన కాంగ్రెస్

లక్ష ఇళ్లు కట్టని విషయం తెలియని మంత్రి తలసాని తనకు ఛాలెంజ్ విసిరారని ఆయన చెప్పారు.  రెండు రోజుల పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమం కొనసాగింది. అయితే ఇతర నియోజకవర్గాల్లో నిర్మించిన ఇళ్లను కూడ జీహెచ్ఎంసీ పరిధిలో చూపుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమం నుండి వెనక్కి వచ్చిన విషయం తెలిసిందే.

హైద్రాబాద్ లో ప్రభుత్వ భూములను చూపితే ఇళ్లు కట్టిస్తామని టీఆర్ఎస్ నేతలు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. హైద్రాబాద్ లో లక్ష ఇళ్లు కట్టలేదని ప్రభుత్వం ఒప్పుకొన్నట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫార్మా సిటీ పేరుతో ప్రభుత్వం 7,950 ఎకరాల భూమిని తీసుకొందన్నారు.  వ్యాపారం చేసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రం రాలేదనే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు.ఫార్మా కంపెనీల వెనుక ఎవరున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

click me!