టీఆర్ఎస్ రెండో జాబితా: ఖరారైన అభ్యర్థులు వీళ్లే..?

Published : Oct 09, 2018, 07:14 PM ISTUpdated : Oct 09, 2018, 07:17 PM IST
టీఆర్ఎస్ రెండో జాబితా: ఖరారైన అభ్యర్థులు వీళ్లే..?

సారాంశం

టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మెుదటి జాబితాలో 119 స్థానాలకు గాను 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిగిలిన 14 అభ్యర్థుల జాబితాను పెండింగ్ లో పెట్టారు. 

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మెుదటి జాబితాలో 119 స్థానాలకు గాను 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిగిలిన 14 అభ్యర్థుల జాబితాను పెండింగ్ లో పెట్టారు. కేసీఆర్ పెండింగ్ లో పెట్టిన నియోజకవర్గాలన్నీ కీలకమైన స్థానాలు కావడంతో కేసీఆర్ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఈ నేపథ్యంలో అదిగో జాబితా ఇదిగో జాబితా అంటూ ఊరిస్తూ వస్తున్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో గులాబీ బాస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 12 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. 

వరంగల్ ఈస్ట్-నన్నపనేని నరేందర్, మేడ్చల్-సీహెచ్, చొప్పదండి-రవిశంకర్, హుజూర్ నగర్-సైదిరెడ్డి, జహీరాబాద్-ఎర్రోళ్ల శ్రీనివాస్, కోదాడ-చంద్రరావు, ముషీరాబాద్-ఎం గోపాల్, గోషామహాల్-ప్రేమ్ సింగ్ రాథోడ్, వికారాబాద్-రాంచందర్, అంబర్ పేట్-ఎడ్ల సుధాకర్ రెడ్డి, మల్కాజ్ గిరి-మైనంపల్లి హన్మంతరావు, ఖైరతాబాద్-దానం నాగేందర్ లకు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. 

అయితే మరో రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చెయ్యాల్సి ఉంది. ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత రెండో జాబితాను అధికారికంగా ఆపద్ధర్మ సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu