రెండు కోట్లిస్తే నా ఆస్తులు మొత్తం రాసిస్తా : పుట్టా మధు

Published : Oct 09, 2018, 06:36 PM ISTUpdated : Oct 09, 2018, 06:37 PM IST
రెండు కోట్లిస్తే నా ఆస్తులు మొత్తం రాసిస్తా : పుట్టా మధు

సారాంశం

తనపై వస్తున్న ఆరోపణలపై కరీంనగర్ జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు స్పందించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కావాలనే తనమీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తాను రూ. 900 కోట్లు సంపాదించారని అంటున్నారని...ఎవరైనా తనకు రూ. 2కోట్లిస్తే నా ఆస్తులు మొత్తం రాసివ్వడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికే ప్రత్యర్థులు ఇలా అసత్య ఆరోపణలు, కేసులు పెడుతున్నారని మధు తెలిపారు.

ఇటీవలే టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు నుండి తనకు ప్రాణహాని ఉందంటూ బిల్ల రమణారెడ్డి  అనే యువకుడు  డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీ స్థానిక పోలీసులను కూడా ఆదేశించిన విషయం తెలిసిందే. 

అలాగే మంథని మాజీ ఉప సర్పంచ్ కూడా మధుపై అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మధు తన పేరిట, తన కుటుంబ సభ్యుల పేరిట దాదాపు రూ.900 కోట్ల ఆస్తులు కలిగి వున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  

ఇలా వరుసగా తనపై అసత్య ఆరోపణలు రావడంపై పుట్టా మధు వివరణ ఇచ్చుకున్నారు. అట్టడుగు  స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగిన తనను రాజకీయంగా అణగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నాయి. అందులో భాగంగానే ఇలా ఎన్నికల సమయంలో అసత్య ప్రచారాలు జరుగుతున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

పుట్ట మధు నుండి నాకు ప్రాణహాని: రమణారెడ్డి

నా మీద విచారణ జరపండి.. రూ.900 కోట్లు సంపాదించడం సాధ్యమేనా: పుట్టా మధు

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు