కేరళకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆర్థిక సాయం... ఎవరెంత చేశారంటే...

By Arun Kumar PFirst Published Aug 19, 2018, 2:53 PM IST
Highlights

భారీ వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ సర్కార్ రూ. 25 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా కేరళ ప్రజలకు ఆహార పదార్థాలను, తాగునీటితో పాటు అవసరమైన సరుకులు అందిస్తోంది.  అయితే కేవలం ప్రభుత్వమే కాకుండా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా కేరళకు సాయం చేయడానికి ముందుకువచ్చారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ నాయకులు వ్యక్తిగతంగా ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరెవరు, ఎంతెంత సాయం ప్రకటించారో తెలుసుకుందాం.
 
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, రవాణ శాఖమంత్రి పట్నం మహేందర్ రెడ్డిలు కేరళ వరద బాధితులకు తన వంతు సాయం ప్రకటించారు. తమ నెల జీతాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపనున్నట్లు వారు ప్రకటించారు. 

ఇక హోం మంత్రి నాయిని నరసింహరెడ్డి కూడా తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు.  ప్రభుత్వ సాయం రూ.25 కోట్ల చెక్ ను అందించడానికి నాయిని కేరళకు వెళ్లారు. ఈ చెక్ తో పాటు తన వ్యక్తిగత విరాళాన్ని కూడా కేరళ సీఎం కు అందించనున్నారు.

జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపి బిబి పాటిల్ కూడా కేరళ వరద బాధితులకోసం తన 2 నెలల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ విరాళాన్ని కేరళ సీఎం సహాయనిధికి పంపనున్నట్లు ఆయన ప్రకటించారు.

హైదరాబాద్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా వరద బాధితులకు సాయం ప్రకటించారు. 500 క్వింటాళ్ల బియ్యంతో పాటు పప్పు దినుసులు, పంచదార వంటి నిత్యావసరాలను బాధితులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు వాటిని సిద్దం చేసి ప్రత్యేక వాహనంలో కేరళకు తరలించనున్నట్లు కృష్ణారావు తెలిపారు. 
 
click me!