జనసేన నాయకుడికి రూ.53,000 ఫైన్, ఎందుకో తెలుసా?

By Arun Kumar PFirst Published Aug 19, 2018, 11:56 AM IST
Highlights

హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని నో పార్కింగ్ ఏరియాలో ఓ ఇన్నోవా కారు ఆగివుంది. దీన్ని గమనించిన ఆ ఏరియా ట్రాఫిక్ ఎస్సై ఆ కారుకు చలాన్ వేయడానికి సిద్దమయ్యారు. అయితే ఆ కారుపై ఉన్న ఫెండింగ్ చలాన్లను చూసి ఆ ఎస్సై అవాకయ్యాడు. ఆ కారుపై ఏకంగా 54 వేల పెండింగ్ చలాన్లున్నాయి. 
 
ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బాలాజీ జనసేన పార్టీ నాయకుడు. ఇతడు గత రెండు సంవత్సరాల నుండి ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని వాడుతున్నాడు. అయితే ఇతడు వ్యక్తిగత పనులపై తరచూ హైదరాబాద్ కు వస్తుంటాడు. ఇలా వచ్చినపుడు వివిధ సందర్భాల్లో ట్రాఫిక్ ఉళ్లంగనలకు పాల్పడ్డాడు. దీంతో ఈ కారుపై భారీగా చలాన్లు నమోదయ్యాయి.

నిన్న శనివారం కూడా హైదరాబాద్ కు వచ్చిన బాలాజీ హిమాయత్ నగర్ కు వెళ్లాడు. ఇక్కడ ఓ నో పార్కింగ్ ఏరియాలో తన కారును నిలిపాడు. దీన్ని గమనించిన ట్రాఫిక్ ఎస్సై కృష్ణంరాజు ఈ వాహనానికి జరిమానా విధించాడు.అయితే ఈ వాహనం ఇప్పుడే కాదు గతంలోను 45 సార్లు ట్రాఫిక్ ఉళ్లంఘనలకు పాల్పడినట్లు ఎస్సై గుర్తించారు. ఈ జరిమానాల మొత్తం రూ.54వేలు ఉన్నట్లు తేలింది. దీంతో వాహనాన్ని సీజ్ చేయడానికి పోలీసులు సిద్దమయ్యారు.

అంతలోనే అక్కడికి వచ్చిన బాలాజీకి పోలీసులు ఈ విషయం తెలిపారు. దీంతో అతడు అక్కడికక్కడే పాత జరిమానాలతో పాటు తాజా ట్రాఫిక్ ఉళ్లంఘనల మొత్తాన్ని చెల్లించి తన కారు తీసుకుని వెళ్లిపోయాడు. 
 
click me!