జగన్‌ దంపతులను చూస్తేనే నా జన్మ ధన్యం....కిడ్నీ రోగి చివరి కోరిక

By sivanagaprasad KodatiFirst Published Aug 19, 2018, 2:03 PM IST
Highlights

వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి దంపతలను చూస్తే తన జన్మధన్యమవుతుందని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నఓ రోగి తన చివరి కోరికగా కోరాడు.....అప్పుడే తనకు ఆనందమంటున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోళికి చెందిన విద్యాసాగర్  కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలవాలని కోరిక ఉండేదట. అయితే అది నెరవేరలేదు.

మహబూబ్ నగర్ : వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి దంపతలను చూస్తే తన జన్మధన్యమవుతుందని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నఓ రోగి తన చివరి కోరికగా కోరాడు.....అప్పుడే తనకు ఆనందమంటున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోళికి చెందిన విద్యాసాగర్  కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలవాలని కోరిక ఉండేదట. అయితే అది నెరవేరలేదు.

 అయితే ఆయన తనయుడు వైఎస్ జగన్ అన్నా అంతే అభిమానం అంటున్నారు విద్యాసాగర్. జగన్ ను అయినా చూసి మాట్లాడాలి అనిపించినా కుదరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ ఇంజనీర్ గా ఎన్నోప్రాజెక్టుల్లో సేవలందించిన తనకు ఎక్కడా సరైన గౌరవం దక్కలేదన్నారు. కానీ వైఎస్ కుటుంబాన్ని చూస్తే తనకు తెలియకుండా ధైర్యం వస్తుందన్నారు. 

ఇంజనీర్ గా పనిచేస్తున్న సమయంలోనే రెండు కిడ్నీలు చెడిపోయాయని..అల్సర్ కూడా వచ్చిందని విలపించాడు. తనకు ఆసరాగా ఉంటుందనుకున్నకుమార్తె సైతం చనిపోయిందని ఆమె కూడా జగన్ ను చూడాలని కోరుకునేదని తెలిపారు. ఆమె కోరిక తీరకుండానే చనిపోవడంతో తన కోరిక అయినా తీరుతుందా లేదా అని బెంగ వచ్చిందన్నారు. 

అయితే విద్యాసాగర్ కోరిక తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి  తన తరపున తెలంగాణ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాం త్‌రెడ్డిని పంపించారు. దీంతో విద్యాసాగర్ వాళ్లను చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తన మాటమన్నించి వైసీపీ నేతలను పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

ఇంతటి మంచి గుణం ఉన్నందుకే వైఎస్ఆర్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని....అందుకే ఆయనను జననేతగా పిలుస్తారని గుర్తు చేశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విద్యాసాగర్‌కు అన్నివిధాలుగా పార్టీ  అండగా ఉంటుందని రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని జగన్ ఆదేశించారని తెలిపారు. 

click me!