అధికార టీఆర్ఎస్ కి షాక్... బిజెపిలో చేరిన మున్సిపల్ చైర్‌పర్సన్‌

First Published Jun 29, 2018, 3:30 PM IST
Highlights

బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో...

అధికార టీఆర్ఎస్ పార్టీకి నల్గొండ జిల్లాలో షాక్  తగిలింది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో ప్రతిపక్షాలు బలంగా ఉండి టీఆర్ఎస్ పార్టీని బలంగా ఢీకొంటున్నాయి. ఇలాంటి సమయంలో అధికార పార్టీ నుండి భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న సుర్వి లావణ్య పార్టీని వీడారు. ఈమె బిజెపి అద్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈమెతో పాటు పట్టణ 7 వ వార్డు కౌన్సిలర్ ఎలిగల నరేష్ కూడా బిజెపిలో చేరారు. 

అయితే ఈమె మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి పార్టీ నుండే కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. బిజెపి, టిడిపి కూటమి పొత్తులో భాగంగా లావణ్యను మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె రాజకీయ కారణాలతో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో అధికార టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

అయితే టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆమె ఇమడలేక పోయారు. చేరిన ఆరు నెలలకే పట్టణంలోని టీఆర్ఎస్ నాయకులతో విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటినుండి ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అప్పటినుండి ఆమె బిజెపి నాయకులతో టచ్ లో ఉంటున్నారు.

అయితే కొద్ది రోజులుగా సొంతగూటికి చేరడానికి లావణ్య ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. గతంలో సంగారెడ్డి లో జరిగిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లోనే ఆమె బిజెపిలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ఆమె చేరిక వాయిదా పడింది. తాజాగా షాద్‌నగర్‌లో జరుగుతున్న జనచైతన్య యాత్రలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆమెతో మరో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ ఎలిగ నరేష్‌ కూడా బీజేపీలో చేరారు.
 

click me!