కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ఉభయసభల్లో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన టీఆర్‌ఎస్ ఎంపీలు..

Published : Apr 04, 2022, 11:44 AM IST
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ఉభయసభల్లో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన టీఆర్‌ఎస్ ఎంపీలు..

సారాంశం

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య నాయుడుకు, లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాకు లేఖలను అందజేశారు. 

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య నాయుడుకు, లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాకు లేఖలను అందజేశారు. రూల్ 187 ప్ర‌కారం కేంద్ర మంత్రి పీయూష్‌పై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇస్తున్న‌ట్లు రాజ్య‌స‌భ చైర్మన్‌‌కు ఇచ్చిన లేఖ‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు తెలిపారు. ఏప్రిల్ 1న ప్రశ్నోత్తరాల సమయంలో పారా బాయిల్డ్ రైస్ ఎగుమ‌తిపై మంత్రి పీయూష్ ఇచ్చిన స‌మాధానం త‌ప్పుదోవ ప‌ట్టించేలా ఉంద‌న్నారు.

వాస్త‌వానికి విదేశాల‌కు మిలియ‌న్ ట‌న్నుల బాయిల్డ్ రైస్‌ను ఎగుమ‌తి చేస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వ వెబ్‌సైట్‌లో ఉంద‌ని చెప్పారు. మంత్రి స‌మాధానం స‌రైన రీతిలో లేని కార‌ణంగానే ఆయ‌న‌పై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. 

‘‘డబ్ల్యూటీవో ఆంక్ష‌ల వ‌ల్లే పారా బాయిల్డ్ రైస్‌ను విదేశాల‌కు ఎగుమ‌తి చేయ‌డం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించే ప్రకటన చేశారు. కానీ వాస్తవం ఏమిటంటే భారత్‌ లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఇది చూపబడింది. ఇది దేశాన్ని తప్పుదోవ పట్టించింది’’ అని టీఆర్‌ఎస్ ఎంపీలు తమ నోటీసులో పేర్కొన్నారు. లోక్‌స‌భలో కూడా టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఇదే అంశాన్ని లేఖ‌లో ప్ర‌స్తావిస్తూ రూల్ 222 కింద స్పీక‌ర్‌కు నోటీసు ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ