నేను ఎవరినీ మోసం చేయలేదు, ఇకపైనా చేయను.. ఈడీ విచారణకు సహకరిస్తా: నామా వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jun 19, 2021, 02:48 PM IST
నేను ఎవరినీ మోసం చేయలేదు, ఇకపైనా చేయను.. ఈడీ విచారణకు సహకరిస్తా: నామా వ్యాఖ్యలు

సారాంశం

జార్ఖండ్‌లో మధుకాన్‌ కంపెనీ చేపట్టిన నేషనల్‌ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను దారి మళ్లీంచారంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే

జార్ఖండ్‌లో మధుకాన్‌ కంపెనీ చేపట్టిన నేషనల్‌ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను దారి మళ్లీంచారంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జూన్‌ 25న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

40 ఏళ్ల కిందట మధుకాన్ సంస్థను ప్రారంభించానని.. రాత్రింబవళ్ళు కష్టపడి సంస్థను కాపాడుకున్నానని నామా గుర్తుచేశారు. చైనా సరిహద్దుల్లో కనీసం వెళ్లలేని ప్రాంతాల్లో కూడా తమ సంస్థ వెళ్లి రోడ్లు వేస్తోందని తాము ఎవరిని మోసం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సంస్థను తమ ఇద్దరు సోదరులు చూసుకుంటున్నారని.. ఎన్‌హెచ్‌ఏఐ అనుమతులు ఇచ్చిన కంపెనీకి ఇవ్వాల్సిన 80 శాతం సైట్ ఇవ్వాలి కానీ 21 శాతం మాత్రమే ఇచ్చిందని నామా నాగేశ్వరరావు అన్నారు.

Also Read:టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు షాక్: సమన్లు జారీ చేసిన ఈడీ

కంపెనీల్లో తాను ఎండీగా లేనని... తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. 25న ఈడీ విచారణకు పిలిచిందని కచ్చితంగా వెళ్తానని తాను అన్నింటికీ సహకరిస్తానని నామా స్పష్టం చేశారు. తానెప్పుడూ నీతి నిజాయితీగా ఉంటూ, రాబోయే రోజుల్లో అదే విదంగా ప్రజలకు సేవ చేయాలని నడుస్తున్నానని పేర్కొన్నారు. తనను ఆదరించి సీఎం కేసీఆర్ ఎంపీని చేశారని నాబలం కేసీఆర్, నా బలగం ఖమ్మం ప్రజలు అంటూ నామా వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు